|
|
Articles: Devotion | శారదాంబా - Mr. venkataramayya putrevu
| |
రావమ్మ మాయింటికీనాడు శారదాంబా!
ముచ్చటగా ముగ్గులిడి పచ్చని పందిళ్ళు పరచినాను
గంగాజలకమ్ములివె తెచ్చితినమ్మా నీ పాదముల్
ప్రోక్షింపగా, నీ మృదుమంజీరనాదాల శ్రావ్యధ్వనులు
మా హృదయాంతరాళలో ప్రతిద్వనింపగా, కదలిరావమ్మ
మాయింటికీనాడు, శారదాంబా!!
నట్టిట సింహాసనమిదే కుదురుగ అమర్చితినోయమ్మ
సుఖాసీనవై, మా పూజలందుకొని మమ్మేలుమోయమ్మా
మాయమ్మా శారదాంబా!
మల్లెల, మొల్లల, విరజాజుల మాలికలలి నీ
పాదాలజెంతజేర్చి, ధూపదీపాదికంబులిడి
నిన్నె కొల్చుకుంటామోయమ్మా, దేవీ సరస్వతీ
సకలసంపత్ప్రదాత్రీ!
కొలిచేవారికి కొంగుబంగరమై,
జ్ఞానమొసగెడి తల్లివి నీవెగదమ్మా
నిరంతర నీ పాదకమలసేవన్
ప్రసాదించి మము పాలింపుమోయమ్మా, దేవీ సరస్వతీ
పద్మసంభవు రాణి వాణీ!!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|