|
|
Articles: TP Features | ఉతికి ఆరేయండి! - Site Administrator
| |
(శరత్ కుమార్)
ఇదేదో నా బాస నా ఇష్టం అనే కేసీఆర్ తెలంగాణా వాదులకు ఇచ్చిన పిలుపు కానే కాదు. అమెరికా పరిశోధకులు ప్రపంచానికి ముఖ్యంగా అమెరికా వాసులకు చేసిన సూచన. భూగోళాన్ని, మానవాళిని కాలుష్యం నుంచి రక్షించడానికి ఉతికి ఆరేయడమే ఉత్తమమైన మార్గమని తేల్చి చెప్పిన శాస్త్రీయ సూత్రం. భారతీయులు అనుసరించే ఈ పద్ధతి వలన కొన్నివేల టన్నుల బొగ్గుపులుసు వాయువు (కార్బన్ గ్యాస్) వాతావరణంలో కలవకుండా నిరోధించవచ్చని ఈ పరిశోధకులు కనిపెట్టారు. కన్యాశుల్కం నాటకంలో గురజాడ చెప్పినట్లు 'అన్నీ మన వేదాల్లో ఉన్నాయష'... నిజమేనని, భారతీయుల జీవన శైలిలోనే శుభ్రత, స్వచ్ఛత, ఆరోగ్యం ఇమిడి ఉన్నాయని, జీవశాస్త్ర, వాతావరణ శాస్త్ర పరిశోధకులు ఈవాళ చెబుతున్న ఆరోగ్య సూత్రాలను భారతీయులు అనాది నుంచీ ఆచరిస్తున్నారని ప్రపంచం తెలుసుకుని నివ్వెరపోతోంది.
బట్టలు ఉతికి బయట దండేలకు వేలాడదీసి ఆరేయడం అంటే అమెరికా నవ నాగరిక సమాజంలో చాలా ఇబ్బందికరమైన అంశం. ధరించే లోదుస్తులు బహిరంగంగా ప్రదర్శించినట్లు భావిస్తారు. కాగా భారతదేశంలో ఉతికిన బట్టలను ఎర్రటి ఎండలో ఆరేయడం అతి సాధారణం. ఎండ వేడిమికి దుస్తుల్లోని నీరు స్వచ్ఛమైన ఆవిరిగా మారి వాతావరణంలో కలవడం, ఆరోగ్యానికి హాని చేసే సూక్ష్మ జీవులు నశించడం, ఎండకు బట్టలపై మచ్చలు, మరకలు మాయమై చక్కగా కనిపించడం వంటి లాభాలను భారతీయులు పొందుతున్నారు. ఇప్పుడు ఈ పద్ధతినే పాటించాలని అమెరికా పౌరులకు అక్కడి పరిశోధకులు సలహా ఇస్తున్నారు. దీనివలన వ్యర్ధవాయువులు వాతావరణంలో కలవకుండా నిరోధించడమే కాకుండా బోలెడంత విద్యుత్ ను ఆదా చేయవచ్చని వారు చెబుతున్నారు. అంతేనా భారతీయ గృహస్థులు పాటించే అతి సులువైన పదిహేడు సూత్రాలను ప్రపంచ వాసులు తమ జీవన విధానంలో అలవర్చుకుంటే రాబోయే తరాలను రక్షించవచ్చని కూడా తమ పరిశోధనల్లో రుజువైనట్టు వారు వివరిస్తున్నారు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|