|
|
Articles: Poetry | మనసుకి మరోవైపు - Mrs. subba lakshmi
| |
రాలిపోయే శిథిల పత్రం
కొత్త చిగురుకి దారిచ్చినట్లే
జరిగిపోయే ప్రతి వత్సరం
లిఖిస్తుంది జీవిత పుటలలో-
అనుభవాలను మిగిల్చిన అనుభూతుల్ని
ఆ ఒక్కొక్క అనుభవమే--
మనిషిని ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ వస్తుంది.
గుప్పెడు గుండెలోని - అరలలో,
ఒక్కొక్క అనుభూతి - మిగిల్చిన జ్ఞాపకాలకు,
మనిషి నిర్లక్ష్యపరిచే
ఎన్నడూ నిలిచి ఆలోచించని - రెండవ వైపు
ఎప్పుడూ అంతరాంతరాలలో
మగ్గిపోతూ ఉంటుంది
'ఇలా చేసి ఉండాల్సింది' --
'అలా చేయకుండా ఉండాల్సింది'
అంటూ మనలో స్పందించేదే -
మనసుకి 'ఆ మరో వైపు'
జీవితోన్నతిని సాధించదలుచుకున్న ప్రతి మనిషీ
ఆ రెండో వైపునే తరచి - తరచి మదిస్తే
రాదు జీవితంలో నిరాశపరిచే ఏ క్షణం.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|