|
|
Articles: Recipes | పూరీ లడ్డూలు - Site Administrator
| |
కావలసిన పదార్థాలు :
పూరీల పొడి - 2 గ్లాసులు
పంచదార పొడి - 4 గ్లాసులు
పుట్నాలపొడి - గ్లాసు
కరిగించిన నెయ్యి - గ్లాసు
జీడిపప్పు - 50గ్రా
బాదం పప్పు - 50గ్రా
యాలకుల పొడి - 1 టీస్పూన్లు
పచ్చకర్పూరం పొడి - పావు టీస్పూను
తయారుచేసే విధానం : మనం సాధారణంగా ఇంట్లో పూరీలు చేసుకుంటూనే ఉంటాం. కాక పోతే వచ్చిన చిక్కల్లా ఒక్కోసారి అవి మిగిలిపోతూ ఉంటాయి. అలా మిగిలిన పూరీలను ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం. ఈ సారి పూరీలు అలా మిగిలిపోతే పూరీల లడ్డూలు చేసుకుంటే సరి. అవి ఎంతో రుచిగా కూడా ఉంటాయి. స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి బాగా కాగాక మిగిలిపోయిన పూరీలను మరోసారి కరకరలాడేలా వేయించి పక్కన పెట్టుకోండి. వాటిని మెత్తగా పొడి చేసి, అందులో పుట్నాలపొడి, పంచదార పొడి, యాలకుల పొడి, పచ్చకర్పూరం పొడులను ఒక పాత్రలో వేసి బాగా కలపాలి. దాంట్లో కాగబెట్టిన నెయ్యి వేస్తూ బాగా ముద్దగా కలపాలి. తరువాత ఆ మిశ్రమాన్ని లడ్డూల మాదిరిగా చుట్టి జీడిపప్పును, బాదం పప్పును అద్దితే వెరైటీ పూరీ లడ్డూలు రడీ అయినట్లే...!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|