|
|
Articles: Poetry | అందాల బొమ్మగా.. - Mrs. sujatha Thimmana
| |
అందాల బొమ్మగా
నను కన్న అమ్మనే
నా ఒడిని చేరెనే
నా కనులు చెమర్చెనే
నీ లేత బుగ్గలు
తామర పూమొగ్గలు
గులాబిరేకులే
నీ పాదాలు
సుతిమెత్తని నీ స్పర్శనే
అనుభూతి చెందితినే
ధన్యత పొందితినే...
అమ్మవై అపుడు లాలించినావు
పాపవైన నిన్నిపుడు
నా గుండెల దాచుకుంటా
అడుగడుగున అరచేయుంచి
ఆపదల కాచుకుంటా....
నీవమ్మవైనపుడు
నీ పిల్లలకు తాతనవుతా
మనవడితో పోటీ పడి
నీ ఒడినే పంచుకొని
ఆదమరిచి నిద్దురపోతా...
ఆదమరిచి నిద్దురపోతా...
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|