|
|
Articles: TP Features | 'బాధిత భర్తల ఫోరం' - Site Administrator
| |
(మల్లికార్జున్)
'మమ్మల్ని వేధిస్తున్నారు... హింసిస్తున్నారు. సంసారంలో మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. వీరి హింస బారి నుంచి మమ్మల్ని కాపాడండి' అన్న 'ఆర్తనాదాలు' వినగానే మనకు చటుక్కున గుర్తుకు వచ్చేది. దుర్మార్గులైన భర్తల చేతిలో బాధపడుతున్న భార్యల గాథలే! కానీ... మీరు చదివిన 'గావు కేక'లు భార్యలవి కావు. భర్తలవేనంటే ఆశ్చర్యపోనక్కరలేదు. అక్షరాలా 'గయ్యాళి భార్య'ల చేతుల్లో, చేతల్లో చిత్తయిన భర్తల ఆవేదనలే... అవి.
గృహ హింస అవగాహన మాసం అక్టోబర్ 31తో ముగుస్తోంది. ఈ మాసంలో ఇతర నెలలకన్నా... ఎక్కువగా భార్యలు తమ భర్తలపై - పోలీసులకు ఫిర్యాదులు చేసి ఉండొచ్చు. కానీ హైదరాబాద్ లో మాత్రం... భార్యలు తమను హీనంగా చూస్తున్నారని 'బాధిత భర్త'లు దీనంగా పోలీసులతో మొరపెట్టుకుంటున్నారు... వీరంతా కూడా కట్నం వేధింపుల పేరిట తప్పుడు కేసులు, ఇంటిలో దూషణల సత్కారం గురించి హైదరాబాద్ నగర వీధుల్లో కరపత్రాలు పంచుతూ బాధిత భర్తలకు సంఘీభావం పలుకుతున్నారు. మగవాళ్ళ భద్రతకు మరిన్ని 'రక్షణ'లు కావాలని కోరుతున్నారు. పురుషుల పట్ల వ్యతిరేకభావంతో, మహిళల పట్ల పక్షపాత ధోరణితో సమాజం వ్యవహరిస్తోందంటూ సదస్సులు, సమావేశాలను వీరు ఏర్పాటు చేస్తున్నారు. బాధిత భర్తలు ఉన్న కాలనీల్లోకి పోయి... ముందుకొచ్చిపోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
అంతేకాదు... వేధింపులకు గురైన ఈ 'భాగస్వాము'లంతా ఆలిండియా పురుషుల సంక్షేమ సంఘం (ఏఐఎండబ్ల్యూఏ)ను ప్రారంభించారు. మగవారి సంక్షేమం కోసం, ప్రయోజనాల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను నెలకొల్పాలన్న డిమాండ్ పై జాతీయ స్థాయిలో పోరాడాలని కూడా నిర్ణయించుకున్నారు. సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ (ఎసీఐఎఫ్ఎఫ్) ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ ఎస్ వేణుగోపాల్ మాట్లాడుతూ, 'జంతువుల ఆలనా పాలనా చూసేందుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంది. స్త్రీ సంక్షేమానికీ ఓ శాఖ ఉంది. కానీ సంసారాలను నెట్టుకొచ్చే పురుషుల యోగక్షేమాలను పట్టించుకునేందుకు ఓ శాఖ లేకపోవడం ఆలోచించాల్సిన విషయం'గా పేర్కొన్నారు. గతంలో బాధిత భర్తలు తమ 'అగచాట్లు' చెప్పుకోవడానికి ముందుకు వచ్చేవారు కాదని ఆయన పేర్కొన్నారు. 'రాష్ట్రంలో పురుషుల ఇక్కట్ల పట్ల సంస్థలు స్పందిస్తున్నాయని' చెప్పారు. 'సిఫ్'లో నేను చేరినపుడు కొద్దిమందే ఉన్నారు. ప్రస్తుతం వీరి సంఖ్య పెరిగింది అని వివరించారు.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|