|
|
Articles: Poetry | నా తల్లి భాష - Site Administrator
| |
(కలువకుంట నారాయణపిళ్ళై)
నా మాతృభాష
హృదంతర భావనా సముద్రఘోష
అమరులకు సైతం అందని పీయూష.
నా తెలుగు పలుకులమ్మ
గురజాడ పుత్తడిబొమ్మ
మధురోహల పట్టుగొమ్మ
నా అమ్మ మాటలు
తరతరాల అనుభూతుల మూటలు.
నా భాష - నా గుండెచప్పుడు
నా చైతన్యం/ మేథస్సు/ ఉషస్సు
షడ్రసోపేత భోజ్యం భావనా సామ్రాజ్యం
పరమపూజ్యం.
నా భాష - కమ్మని జోలపాటలు పాడే తల్లి
ముద్దుముద్దుగా సుద్దులు బుద్ధులు నేర్పే ఒజ్జ
పరభాషల్ని పరిచయం చేసే నేస్తం
ముందుకు సాగడానికి సాయపడే హస్తం
వరాల వర్షాలు కురిపించే ఆర్ద్రతా దైవం.
ఇంగ్లీషు భాషే 'విద్య'గా భ్రమపడ్డారు కొందరు
మాతృభాషను చులకనగా చూశారు మరికొందరు
ఆలనా పాలనా కరవై మసకబారుతోంది నేటి తెలుగువెలుగు
తల్లి భాష ఔన్నత్యాన్ని గుర్తిద్దాం
అడ్డంకులు తొలగిద్దాం
తెలుగు 'పలుకుబడి' పరిరక్షణ లక్ష్యంగా
పిడికిళ్ళు బిగిద్దాం
పిడుగులు వర్షిద్దాం.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|