|
|
Articles: Poetry | గెలుస్తూ..ఓడుతున్నాను - Site Administrator
| |
(పాతూరి అన్నపూర్ణ)
మాటల్ని పక్కవాళ్ళతో
పంచుకోవాలని ఉన్నా
సరిపోని సమయం...
రోజులన్నీ క్షణాలుగా గడచిపోతున్నాయి.
ఉరుకుల పరుగుల జీవితాన్ని పట్టుకోవడానికి
రెండు చేతులు చాలడం లేదు.
గుప్పెడంత గుండె చెప్పే ఊసుల్ని
ఊ కొట్టకుండానే నిద్రపుచ్చుతున్నాను.
ఒక చెవి పూర్తిగా సెల్ కి అంకితం
చేతులు లాప్ టాప్ తో ఆడుకుంటూ!
రోబోట్ లా మనసు పనిచేయని యాంత్రికత
నాకోసమంటూ
గంటయినా వెచ్చించలేని అసహాయత్వం!
అలసిపోయిన శరీరం
'ట్రాఫిక్ జాం'లో మరింత విసిగిపోయి
ఏ రాత్రో ఇల్లు చేరి పడక మీద వాలిపోతుంది!
వెన్నెల లాంటి బాల్యం
పంచరంగుల కలలా కరిగిపోయింది
చదువులలో అందరికన్నా ముందుండాలన్న పరుగు
పోటీ పరీక్షలలో ర్యాంకుల కోసం పరుగు
డబ్బు సంపాదన కోసం ఆగకుండా పరుగు
ఈ పందెంలో వెనకపడ్డానంటే
నన్ను దాటి వెళ్ళేవాళ్ళెందరో?
ఓడిపోకూడదనే పరుగులు తీస్తున్న నేను
జీవితాన్ని అనుభవించడంలో ఓడిపోతున్నాను
మనసును జయించడంలో ఓడిపోతున్నాను!
| Read 4 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|