|
|
Articles: Poetry | తెలుగు భాష - Mrs. sujatha Thimmana
| |
గోదావరి నీటి గలగలలా
తెలుగు భాష తళతళా...
అచ్చమైన తెలుగువాడు
స్వచ్చమైన నీటిలా
మిలమిలా...
కంఠమెత్తి పాడిన ఘంటసాల గొంతులో
కోటి గంటలే మ్రోగెను గణగణా...
సుశీలమ్మ గుండెలో
కోకిలమ్మ కుహు కుహూ...
గోదావరి నీటి గలగలలా...
అన్నమయ్య అర్థమూ
వెంకన్న కైక్యమూ...
అంతులేని సాగరమూ
తెలుగు సాహితీ సంబరమూ
గోదావరి నీటి గలగలలా...
పలుకులోన పదము విరియ
తియతేనియలు వొలుకగా
మనసు నిండ అమృతవాన
మమత తీర కురియగా...
గోదావరి నీటి గలగలలా...
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|