|
|
Articles: Recipes | రవ్వ బొబ్బట్లు - Site Administrator
| |
కావాల్సిన పదార్థాలు
బొంబాయి రవ్వ : ఒక కప్పు
పంచదార : ఒక కప్పు
నీళ్ళు : మూడు కప్పులు
మైదా : ఒక కప్పు
గోధుమ పిండి : పావు కప్పు
నెయ్యి : రెండు టీ స్పూన్స్
వంట సోడా : చిటికెడు
తయారు చేయు విధానం : ముందుగా మైదా, గోధుమ పిండి జల్లించుకోవాలి. తర్వాత దానిలో తగినన్ని నీళ్ళు పోసి పూరీ పిండిలా కలుపుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేసి బొంబాయి రవ్వను దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత అడుగు మందంగా ఉన్న గిన్నెలో ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల నీళ్ళుపోసి మరగనివ్వాలి. నీళ్ళు మరిగిన తర్వాత పంచదార వేసి కలబెట్టాలి. తర్వాత బొంబాయిరవ్వ ఉండలు కట్టకుండా కలుపుతూ చిక్కబడే దాకా ఉంచుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని నిమ్మకాయం సైజులో ఉండలు చేసుకోవాలి. పక్కన పెట్టుకున్న మైదా పిండిని చిన్న సైజు పూరీలుగా వత్తుకోవాలి. పూరీల మధ్యలో రవ్వ పూర్ణాన్ని పెట్టి చుట్టూ పూరీతో మూసేసి దాన్ని కర్రతో లేదా చేత్తో బొబ్బట్టులా ఒత్తి పెనం మీద నూనె కాని నెయ్యి కాని వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలాగే అన్నీ చేసుకోవాలి.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|