|
|
Articles: Recipes | ఉసిరి ఆవకాయ - Site Administrator
| |
కావాల్సిన పదార్థాలు
ఉసిరి కాయలు : ఒక కిలో
ఉప్పు : రెండు గిద్దలు
కారం : రెండు గిద్దలు
ఆవపిండి : ఒక గిద్ద
మెంతిపిండి : ఒక గిద్ద
పసుపు : ఒక టీ స్పూన్
నువ్వుల నూనె : ముప్పావు కిలో
తయారు చేయు విధానం : ముందుగా ఉసిరి కాయలను కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. వంద గ్రాముల ఆవాలను, మెంతులను బాగుచేసుకుని విడి విడిగా బాణలీలో వాటిని వేయించుకోవాలి. అవి చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న మెంతి పిండి, ఆవపిండిలో ఉప్పు, కారం పసుపు వేసి ఈ మిశ్రమాన్ని ఒక బేసిన్ లో వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి పచ్చళ్ళకు వాడుకునే నువ్వుల నూనెను అరకిలో పోయాలి. నూనె వేడెక్కినాక బాణలిలో పట్టినన్ని ఉసిరి కాయలను వేసి చిన్న మంట పెట్టుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. అలానే మిగిలిన కాయలను వేయించి పక్కన పెట్టుకోవాలి. వేయించుకున్న ఉసిరి కాయల్లో గింజలు అక్కరలేదనుకున్నవారు తీసివేసుకోవచ్చు, లేదా కాయలపరంగా నైనా ఉంచుకోవచ్చు. తర్వాత ఉప్పు, కారం, మెంతి పిండి, ఆవపిండి, పసుపు వేసి కలుపుకున్న మిశ్రమంలో వేయించుకున్న ఉసిరి కాయలను వేసి చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఉసిరి కాయలు వేయించుకున్నతర్వాత మిగిలిన నూనెను కూడా పోసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. శుభ్రంగా తుడిచి, ఆరబెట్టిన జాడీలో ఈ పచ్చడిని నిల్వ ఉంచుకోవాలి. జాడీలో పెట్టుకున్నాక కాయలు మునగా నూనెను పోసుకోవాలి. తడి తగలకుండా ఉంటే ఈ పచ్చడి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|