|
|
Articles: Recipes | ఉసిరి పచ్చడి - Site Administrator
| |
కావలసిన పదార్థాలు :
ఉసిరి ముక్కలు : రెండు కప్పులు
నూనె : ఒక కప్పు
కారం : 3 టీ స్పూన్స్
ఉప్పు : 3 టీ స్పూన్స్
ఆవాలు : 4 టీ స్పూన్స్
మెంతులు : 2 టీ స్పూన్స్
పసుపు : అర టీ స్పూన్
నిమ్మకాయ : ఒకటి
ఇంగువ : చిటికెడు
తయారు చేయు విధానం : ఉసిరి కాయల్ని శుభ్రంగా కడిగి, పొడి గుడ్డతో తుడిచి మీడియం సైజు ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. తర్వాత ఆవాలు, మెంతులు విడివిడిగా వేయించి పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి తాలింపు సామాను వేయించాలి. దానిలోనే ఉసిరి ముక్కలను కూడా వేసి మరి కొంచెం సేపు వేయించుకోవాలి. తర్వాత ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, కారం, పసుపు వేసి కలబెట్టుకోవాలి. చివరగా నిమ్మకాయ రసం కలుపుకోవాలి. దీన్ని పొడిగా ఉన్న జాడీలో తడి తగలకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ పచ్చడి రెండు మూడు రోజులు ఊరిన తర్వాత అన్నంలోకి, టిఫెన్స్ లోకి అయినా తినొచ్చు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|