|
|
Articles: My Thoughts | కలకంటి కన్నీరొలికిన.. - Site Administrator
| |
(Miss vijayalakshmi)
'సోమూ నువ్వు నీ శరీరాన్నీ మనసును రిలాక్స్ డు గా వుంచుకో. నీ మనస్సులో ఇప్పుడు ఏ అలోచనలూ లేవు. అంతా ఫ్రీ! ఈజీ!! హేపీ!! ఇప్పుడు నీకు కొద్దిగా మత్తుగా వుంది కదూ! అవును. అలాగే వుంటుంది. నీకు నిద్ర రాబోతోంది. అదిగో నీ కళ్లు మూతలు పడుతున్నాయి. నీవు నిద్రలోకి జారుకుంటున్నావు. నీవు నిద్రపోతున్నావు. నీకీ నిద్ర చాలా తృప్తిగా వుంది. నువ్వు చాలా చాలా హేపీగా వున్నావు.'
'సోమూ!'
'ఊఁ!'
'బాగుందా?'
'చాలా బాగుంది డాక్టరు గారూ!'
'ఇప్పుడు నేను చెప్పే మాటలను సాంతం శాంతంగా విను. నీ చెల్లి ఆడదై పుట్టినందుకు ఎంతో సుఖ పడుతోదనుకుంటున్నావు కదూ! నిజానికి నీ చెల్లి సుఖ పడుతోందో కష్ట పడుతోందో తెలుసుకోవాలంటే- నీ చెల్లి మాటల్లోనే ఆమె ఏం చెబుతోందో విను.'
'అన్నయ్యా! ఈ దేశంలో ఆడదై పుట్టే కన్నా అడవిలో మానై పుడితే మేలురా! ఊరికే అన లేదు. 'ఆడదాని జీవితం అరటాకు వంటిదని. అరిటాకు వెళ్లి ముల్లు మీద పడ్డా, ముల్లొచ్చి అరిటాకు మీద పడ్డా అరిటాకుకే నష్టం. నా స్నేహితురాలు మీనాక్షిని నువ్వెరుగుదువు కదా! పాపం పెళ్లై ఆర్నెల్లు తిరక్కుండానే స్టౌ పేలి వళ్లు కాలి చనిపోయింది. అదేం కర్మమో ఈ దేశంలో కోడళ్లు వెలిగించే స్టౌలే పేలి పోతుంటాయి. అత్త గార్లెవరూ అలా స్టౌలు పేలి చావరు. నిజానికి జరిగిందేమిటో తెలుసా? తెచ్చిన కట్న కానుకలు చాల్లేదని మీనాక్షిని అత్తగారి తరఫు వారు నిలువునా చంపేశార్రా! అన్నయ్యా! ఒక ఆడ దాని నిండు బతుకుని నాశనం చేసి మళ్లీ పెళ్లి చేసుకుని మరో అమ్మయిని చంపడానికి సిద్దంగా వున్నార్రా వాళ్లు.
అంతే కాదురా అన్నయ్యా, నీకు తెలుసుగా 'సర్వమంగళ?' దాని బతుకేమైంది? పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేయాలనే ఆశతో ప్రేమించిన వాడితో లేచి పోయింది. కాని ఆ త్రాష్టుడు దాన్ని తీసికెళ్లి వ్యభిచార గృహంలో అమ్మేస్తే దాని జీవితం కుక్కలు చింపిన విస్తరైంది. ఎలాగో ఆ నరక కూపంలోంచి బయట పడి పోలీసు రిపోర్టైతే ఇవ్వ గలిగింది కానీ ఆ తరవాత తన బతుకు ఎందుకూ పనికి రాదనే బాధతో విషం మింగి ఆత్మ హత్య చేసుకుంది. ఇక 'సుశీల ' ఆస్తి పాస్తులు లేకున్నా అందముంది. గుణ సంపదుంది. కాని, ఏం లాభం? పెళ్లిళ్ల మార్కెట్ లో 'మొగుడ్ని ' కొనుక్కో లేక కన్యగానే మిగిలి పోయింది. మనింటెదర 'రాధ 'గూర్చి నీకు తెలీదా? ప్రేమించిన వాడు పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తే ;కడుపులో పెరుగుతున్న పాప ఫలాన్ని తన జీవిత శాప ఫలంగా భావించి ఎవరికీ చెప్పుకో లేక మౌనంగా రోదించి సీలింగ్ ఫానుకు ఉరేసుకుని ఆత్మ హత్య చేసుకుంది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|