|
|
Articles: Poetry | నేనెక్కడ? - Mr. gopi kiran naidu
| |
కాలచక్రంలో ఇరుక్కున్నాను
గిర్రున తిరిగి తిరిగి
అంతంలోనో ఆరంభంలోనో నిలబడ్డాను
మిగిలింది శూన్యమా...
తరచి చూస్తే కనిపించేది దైన్యమా...?
ఎక్కడున్నాను నేను...?
ముప్పై క్షణాలకే
ఒక సంవత్సర కాలమంతా కరిగిపోతే
నేనేమి సాధించాలి
నన్ను నేనేమి సంస్కరించుకోవాలి
ఎటు చూసినా ఊపిరి బిగపట్టిన ఆశల శ్వాసలే
నిబ్బరం లేని కదుపుబ్బరపు కోర్కెల గసులే
ఎంటిది...?
ఎందుకిలా జరిగింది
నేనేందుకిలా మిగిలాను
హృదయం ఎక్కడ పగిలింది
ఆలోచనల్లో నరం ఏదో నలిగింది
అందుకే ఇలా
శూన్యంలో...
శూన్యతతో
సున్నాలా...
నువు కొత్త ఆశలు తెస్తావేమో
కాని నేను పాతబడిపోయాను
పోతపోయబడిన ప్రాణంలేని మట్టిశిల్పంలా మిగిలాను
ఎందుకిలా
ఏమిటిలా...?
| Read 5 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|