|
|
Articles: Poetry | నానీలు - 57 - Miss kumari kumari
| |
అర్ధ నారీశ్వరులు
నాలుగ్గోడల మధ్య
రాత్రి జరిపే
నాట్య పేరంటం 'పబ్'..
ఆకలి యజ్ణ్జంలో
సమిధకు సిద్ధమైన
గింజ ధైర్యం ..
తినే నీకు ఆదర్శం ..
రేపటి ఆశల చప్పుళ్ళే
సరిగమలుగా ..
రాత్రి వేళ
నిశ్శబ్ద సంగీతం ..
కొందరి తెలివి
ఇసుకలో విత్తనం ..
ఖర్జూరమై పండు
'రోజు' రాక పోదు ..
శీతలీకరణ యంత్రం
మనసు..
అందుకే నవరసాలు
ఎప్పుడూ తాజానే..
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|