|
|
Articles: Poetry | అంతర్యుద్ధం - Dr. rangarao raavi
| |
అరవలు కన్నడిగులు మలయాళీలు
పెద్ద కుటుంబాలైనా
కలిసే ఉంటున్నారు.
తెలుగు కుటుంబంలో
ఏళ్ళ తరబడి అంతఃకలహాలే,
కలిసుందామంటే
కుదరదంటున్నాడు తమ్ముడు,
'వేరు పడటమే మంచిది
అభిమానాలు పెరుగుతాయి
ఒకింటి పేరుతో వూళ్ళో
ఎన్ని కుటుంబాలు లేవు'
అని తేల్చేస్తే బాగుంటుంది కాని
తలలు తెగుతాయి తప్ప
పంపకాలు మాత్రం తెగవు.
అందుకే పెద్దల పట్టుదల
గొడవలున్నా కలిసుందామని.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|