|
|
Articles: Poetry | నానీలు - 58 - Miss kumari kumari
| |
పప్పు బెల్లం ముద్ద
తెల్లని పిండి కవచంతో
జలకాలాడితే ..
భలే 'బూరె'..
నల్ల పప్పు
తెల్లగా మెత్తగా మారి
ఒంటి కన్నుతో
నోరూరిస్తే .. అది 'గారె'..
చలిమిడి
అరచేతంత ఆరిందాలా
అట్టహాసం చేస్తే ..
అదుర్స్ 'అరిశె' ..
కారం - కమ్మదనం
హత్తుకొని
వేడిగా సేద దీరితే ..
ఊరించే 'మిర్చి బజ్జీ ..
పప్పు పొడి - బెల్లం - నెయ్యి
చేత చిక్కి నొక్కి
గుటక వేయిస్తే..
సూపర్ 'సున్నుండ' ...
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|