|
|
Articles: Recipes | గుమ్మడి కాయ పులిహోర - Site Administrator
| |
కావలసిన పదార్ధాలు
గుమ్మడి కాయ ముక్కలు : ఒక కప్పు
బియ్యం : రెండు కప్పులు
నీళ్ళు : నాలుగు కప్పులు
కొత్తిమీర : ఒక కట్ట
ఉప్పు : తగినంత
పచ్చి మిర్చి: నాలుగు
వేరుశనగపప్పు : చిన్న క్పపు
పచ్చిశనగపప్పు : ఒక టీ స్పూన్
ఆవాలు : ఒక టీ స్పూన్
జీలకర్ర : ఒక టీ స్పూన్
కరివేపాకు : రెండు రెబ్బలు
నిమ్మకాయ : ఒకటి
తయారు చేయు విధానం : మంచి గుమ్మడికాయ ముక్కను చెక్కు తీసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను నూనెలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్ళు పోసి కుక్కర్ లో పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పొయ్యి మీద పెట్టి విజిల్ పెట్టకుండా ఆవిరి మీద ఉడికించుకోవాలి. అన్నం మూడొంతులు ఉడికిన తర్వాత వేయించి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్లో ఉప్పు వేసి వీటిని అన్నం పైన వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత బాణిలి పెట్టి రెండు టీ స్పూన్ల నూనె వేసి అది వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగప్పు, వేరుశనగపప్పు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఈ తాలింపును గుమ్మడికాయ రైస్ లో కలిపి, నిమ్మకాయను పిండుకోవాలి. చివరగా కొత్తిమీరను అలంకరించుకోవాలి. ఈ గుమ్మడి కాయ పులిహోర ఎంతో రుచిగా ఉంటుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|