జీవన సాగరంలో
తల్లి పాలు
తొలి చుక్కాని..
బిడ్డ ఏడుపందుకే మాయం!
కను రెప్పల
తలుపులు మూసినా..
ఎదురు చూపుకు
ఆగని తలపులు..
పిసి'నారి'తనంలో
స్త్రీత్వముందిలే..
మగధీరులకు
ఇది తగదు మరి!
ప్రకృతి బీభత్సం
ఋజువు చేసింది..
పంచభూతాల అదుపు
మన భ్రమని..
వెన్నెల్లో కనబడని
చుక్కలు
చీకట్లో మెరుస్తాయి..
కష్టంలో మనిషిలా!