|
|
Articles: Recipes | అటుకుల బన్ను - Site Administrator
| |
అటుకులు : ఒక కప్పు
పెరుగు : అరకప్పు
బియ్యం : రెండు కప్పులు
ఉప్పు : తగినంత
వంటసోడా : చిటికెడు
క్యారెట్ తురుము: ఒక కప్పు
టమాటాలు : రెండు
ఉల్లి పాయలు : మూడు
కొత్తిమీర : ఒక కట్ట
పచ్చి మిర్చి : రెండు
తయారు చేయు విధానం : అటుకులను ముందు రోజు రాత్రి పెరుగులో నానబెట్టుకోవాలి. అలానే బియ్యాన్ని కూడా మరో పాత్రలో నానబెట్టుకోవాలి. నాలుగు గంటల తర్వాత ఈ రెండింటినీ విడివిడిగా గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. మరుసటి రోజు వీటిలో ఉప్పు, వంటసోడా వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలను, పచ్చి మిర్చిని, టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.క్యారెట్ ను తురుముకోవాలి. అలానే కొత్తిమీరను కూడా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి సిమ్ లో పెట్టుకోవాలి. తర్వాత బాణిలి పెట్టి పిండిని బన్నులాగా వేసుకొని ఒక టీ స్పూన్ నూనె వేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న వాటన్నింటినీ పైన అలంకరించుకొని కాల్చుకోవాలి. ఇది విడిగా తిన్నా, పప్పు చట్నీతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|