|
|
Articles: Devotion | కనకదుర్గ పూజ పాట - Miss kumari kumari
| |
(శ్రీమతి కేసవరపు మహాలక్ష్మి)
పల్లవి :
చల్లని తల్లి మా కనకదుర్గ
నీ మహిమెల్ల తెలిసేను ఓ కనకదుర్గ
నన్ను దయచూడుమా శ్రీ కనకదుర్గ
నన్ను కరుణించుమా నా కనకదుర్గ //చల్లని//
చరణం - 1
బెజవాడలోన వెలసిన తల్లి
నిన్ను పసుపు కుంకుమ పూలతో పూజించెదమూ //బెజవాడలోన//
కొలిచిన వారికి - కొంగు బంగారమమ్మ నీవు
కొలువై ఉన్నావు - ఇంద్రకీలాద్రి పైన నీవు //చల్లని//
చరణం - 2
వెంకన్న బాబుకి అక్కగా పుట్టి
మల్లేశ్వర స్వామికి భార్యవైనావు //వెంకన్న//
ఆపదలందు అభయమిచ్చే - ఆది పరాశక్తివమ్మ నీవు
భవానీలకు మాలవై మార్గమై - కోరిన సిరి సంపదలిచ్చేవమ్మ నీవు //చల్లని//
చరణం - 3
ఆశ్వియుజ మాసమున - విజయ దశమి నాడు
నిన్ను గొప్ప గొప్ప గాను - కొలిచెదమూ
నీకు కుంకుమ పూజలు - చేయించెదమూ // ఆశ్వియుజ //
చూడ వచ్చిన వారికి - నవదుర్గవై దర్శనమిచ్చావమ్మ మాకు
చక్కని చల్లని వరాలు కురిపించి - దీవించవమ్మ మమ్ము
నీ దివ్య చరణాలే - శరణమమ్మ మాకు //చల్లని//
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|