|
|
Articles: Recipes | రొయ్యలు చింతచిగురు - Ms. sandya arra
| |
కావాల్సిన పదార్ధాలు :
వంద గ్రాముల రొయ్యలు
యాబై గ్రాముల చింతచిగురు
రెండు టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు
రెండు టీ స్పూన్స్ ధనియాల పొడి
ఒకటి సన్నగా తరిగిన ఉల్లిపాయ
ఒక టీ స్పూన్ పసుపు
ఉప్పు తగినంత
కారం తగినంత
కొత్తిమీర కట్ట
తయారీ విధానం :
ముందుగా రొయ్యలు వేడినీటిలో కడిగిన తరువాత ఒక గిన్నెలో నూనె పోసి రొయ్యలు వేసి తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి పసుపు కలిపి వేయించాలి. ఈ మిశ్రమాన్ని పక్కకు తీసి పెట్టాలి. తరువాత వేరే గిన్నెలో నూనె పోసి చింతచిగురుని కడిగి కొద్దిగా చేతితో నలిపి నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు చింతచిగురు వేసి వేయించాలి. తరువాత వేయించిన రొయ్యలు వేసి ఉప్పు, కారం వేసి మూత పెట్టి ఆవిరికి ఉడకనివ్వాలి (మూతపెట్టి మూతపై నీళ్లు పోయాలి). చివరికి కొత్తిమీర వేసి కొద్దిగా కలిపి చల్లారాక అన్నంలో కలుపుకొని తింటే భాగుటుంది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|