|
|
Articles: Recipes | బ్రెడ్ ఊతప్పం - Ms. sandya arra
| |
కావలసిన పదార్దాలు
బ్రెడ్ స్లయిస్ - పదిహేను
మజ్జిగ - 2 కప్పులు
నూనె - 3 స్పూన్స్
కారం - టీ స్పూన్
ఇంగువ - కొంచెం
ఉల్లిపాయ - ఒకటి
టమాట - ఒకటి
నెయ్యి - 1 టీ స్పూన్
పచ్చిమిర్చి - 4,
ఉప్పు తగినంత
తయారుచేయు విధానం :
ముందుగా బ్రెడ్ ముక్కల చివరి అంచులు తొలగించి చిన్న ముక్కలుగా చేసుకొవాలి. తరువాత ఆ ముక్కలు మజ్జిగలో వేసి పదిహేను నిమిషాలపాటు నానబెట్టాలి. ఇది నానేలోపు స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయాలు, టమాటాలు, పచ్చిమిర్చి ముద్ద , ఇంగువ వేసి (ఇష్టం ఉన్నవాళ్లు బీన్స్, క్యారట్లు సన్నగా తరి గి వేసుకోవచ్చును) మూడు నిమిషాలు వేయించి స్టవ్ మీద నుండి దించి పక్కన పెట్టుకోవాలి. తారువాత మజ్జిగలో నానపెట్టిన బ్రెడ్ ముక్కలను మెత్తగా రుబ్బు కోవాలి. స్టవ్ మీద పెనం లేక బాణలి మీద రుబ్బుకున్న బ్రెడ్ ను ఊతప్పం లాగ వేయాలి. దీనిలో వేయించిన ఉల్లి, టమాట ముక్కలను వేసుకోవాలి. తరువాత అట్లకాడతో నెయ్యి వేస్తూ ఆటు, ఇటు కాల్చి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|