|
|
Articles: Recipes | గుమ్మడి హల్వా - Ms. sandya arra
| |
గుమ్మడి హల్వా
కావాల్సిన పదార్ధాలు :
పండిన గుమ్మడిపండు ఒకటి
పంచదార, బెల్లం పొడి కలసి అర కిలో
జీడి పప్పు, యాలకులపొడి, కిస్మిస్, అన్ని కలిపి పిడికెడు
గసగసాలు ఒక స్పూన్ , తగినంత నెయ్యి
తాయారు చేయు విధానం:
ముందుగా పండిన గుమడిపండును శుభ్రం చేసి పెద్ద ముక్కలుగా కోసి కుక్కరులో కొద్దిసేపు ఉడికించుకోవాలి . ఉడికిన ముక్కలను చెక్కు తీసి గుజ్జును మాత్రమే చిదిమి ఉంచుకోవాలి . తరువాత ఒక బాణలిలో నెయ్యి వేసి దానిలో జీడి పప్పు, కిస్మిస్ ,గసాల వేసి వేయించి గుమడి ముద్ద కూడా వేసి వేయించాలి. తరువాత బెల్లం పంచదార కూడా వేసి మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ భాగా ఉడకనివ్వాలి. ఇలా కొంచెం ముదురు పాకం రాగానే యాలకుల పొడి వేసి దించి నెయ్యి రాసి న పళ్ళెంలో పోసి సమం గా చేయాలి. ఈవిధముగా నెయ్యి పైకి తేలిన గుమడి హల్వా చల్లారాక తింటే చాల రుచిగా ఉంటుంది. మరియూ నెల రోజులవరకు నిల్వ ఉంటుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|