|
|
Articles: Recipes | మష్రూమ్స్ మంచూరియా -
| |
కావలసినవి :
మష్రూమ్స్ : 250 గ్రామ్స్
కార్న్ ఫ్లోర్ అ: 20 గ్రామ్స్
మైదా : 20 గ్రామ్స్
అల్లం: చిన్న ముక్క
టమోటా సాస్ : 2 స్పూన్స్
సోయాసాస్ : 1 స్పూన్
పెప్పర్ : 1 స్పూన్
అజినామాటో : అర స్పూన్
కొత్తిమీర : రెండు స్పూన్స్
పచ్చిమిర్చి : 4
వెల్లుల్లి : 4 రెబ్బలు
ఉప్పు : తగినంత
చిల్లీ సాస్ : 1 స్పూన్
మానే : తగినంత
తయారు చేయు విధానం :
మష్రూమ్స్ ను బాగా కడిగి ఒక గిన్నెలో వేసి వాటికి కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి ఒక పదివిమిషాలు పక్కన ఉంచాలి. మరో గిన్నే తీసుకుని దానిలో మైదా, కార్న్ ఫ్లోర్, పెప్పర్, చిల్లీసాన్, అల్లంవెల్లుల్లి పేస్ట్, అజీనామాటో, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లుపోసి బాగా కలిపి మష్రూమ్స్ వేసి కలియబెట్టాలి. వీటిని నూనెలో బాగా ఫ్రై చేసి పక్కన పెట్టాలి. ఒక బాండి తీసుకొని దానిలో కొద్దిగా నూనే వేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు , అల్లం సన్నగా తరిగి నూనెలో వేసి ఒక నిముషం వేయించి, సోయాసాస్, టమోటా సాస్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి అందులో వేయించి ఉంచుకున్న మష్పూమ్స్ ను వేసి బాగా కలియబెట్టి ప్లేట్లలో అమర్చి పైన సన్నగా తరిగిన కొతిమీర జల్లి వేడివేడిగా తివాలి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|