|
|
Articles: Recipes | పాలక్ పలావ్ -
| |
కావలసినవి :
బాసుమతి బియ్యం : రెండు కప్పులు
మీడియం సైజు పాలకూర : రెండు కట్టలు
పెద్దఉల్లి : 1
అల్లం : చిన్నముక్క
వెల్లుల్లి : 10 రేకలు
మంచి వీళ్లు : అరలీటరు
నూనె : 3 స్పున్స్
జీడిపప్పు : కొద్దిగా
పచ్చిమిర్చి : 3
టమోటా : 1
గరం మసాలా : అర టీ స్పూన్
యాలకుల పొడి : అర టీ స్పూన్
లవంగాల పొడి : చిటికెడు
ఉప్పు : తగినంత
నిమ్మరసం : టీ స్పూన్
తయారు చేయు విధానం :
పాలకూర, ఉల్లిముక్కలు, అల్లం, వెల్లుల్లి ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి కొద్దిగా నీరు పోసి మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టాలి. పాన్ పొయ్యిమీద పెట్టి నూనె వేసి వేడి అయిన తరువాత జీడిపప్పు, పచ్చిమిర్చి, గరం మసాలా, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క పొడులు, బియ్యం వేసి రెండు నిమిషాలు వేయించి ఉప్పువేసి బాగా కలియదిప్పి సరిపడా నీరు పోసి మూతపెట్టి తక్కువ మంటమీద ఉడికించాలి.
తరువాత మెత్తగా రుబ్బి ఉంచుకున్న పాలకూర మిశ్రమాన్ని కూడా జతచేసి మరో పదినిమిషాలు సిమ్ లో ఉంచాలి. చివరగా నిమ్మరసం కలిపి గరిటెతో కలిపి పెరుగు చట్నీతో వేడివేడిగా వడ్డించాలి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|