|
|
Articles: TP Features | మాతృభాష-జాతీయ విధానం - Site Administrator
| |
ఇదే సమయంలో భారతదేశంలో కులాల గురించీ సంచార జాతుల గురించీ వారి భాషల గురించీ మనం తెలుసుకోవాలి. దేవుణ్ణి సృష్టించిన - కాదంటే - దేవుడికి 'తెరతీసిన' మనిషి జ్ఞాన వికాసానికి మూలమూ, సాధనమూ, అంతా భాషేనని మనం గ్రహించుకోవాలి. భాష లేకుండా మనిషి లేడనీ జంతువు నుంచి మనిషిని ప్రత్యేకంగా చూపేది అతని భాషేననీ అనేవారు. జీవన వైవిధ్యాన్ని కాపాడుకోవడం కోసం మాతృభాషల్ని రక్షించుకోవాలనీ అనేవారు - జాతుల మీద పరాయి భాషల పెత్తనాన్ని నిరోధించాలి. ఈ లెక్కన - ఐక్యరాజ్యసమితీ, యునెస్కో వంటి సంస్థలు ప్రపంచం మీద ఇంగ్లీష్ పెత్తనాన్ని నిరోధించాలి. 'ప్రపంచీకరణ' పేరుతో జరుగుతున్న జాతుల పరాయీకరణను, జాతుల విధ్వంసాన్ని నిరోధించాలి. ఇందు కోసం మాతృభాషల సామర్థ్యాన్ని, అవకాశాలను పెంచడానికి వివిధ దేశాల, ప్రాంతాల ప్రభుత్వాలనుత్తేజ పరిచి, సహాయ సహకారాలనందించి వాటిని శక్తివంతం చెయ్యాలి. ఇదేమీ చెయ్యకుండా తప్పించుకొంటూ భాషలు అంతరించిపోతున్నాయంటూ కన్నీరు కార్చడం, పరోక్షంగా బలహీన జాతులను ఆందోళనకు గురిచేసి, వారిని అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పెత్తందార్లకు బలిచెయ్యడం ఎంతవరకు సబబు?
తెలుగుజాతి భాషా సంస్కృతులు ఎంతటి సవాళ్లనెదుర్కొంటున్నాయో మనందరికీ తెలుసు. తెలుగు భాషోద్యమ నిర్మాణంలోని వివిధ అంశాలను చర్చిస్తుంది. తెలుగుజాతి అనే కోణాన్నుంచి చూడకుండా భాషోద్యమ నిర్మాణం గురించి గాని, జాతి పునరుజ్జీవనం గురించిగాని సరియైన దారి దొరకదు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకూ, భారతదేశపు లోక్ సభకూ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలుగు భాషోద్యమ సమాఖ్య రాజకీయ పక్షాల ముందుంచిన చిన్న చిన్న కోరికలు కూడా వాటిని కదిలించవలసినంతగా కదిలించలేకపోతున్నాయంటే, మన రాజకీయ పార్టీల దివాళాకోరుతనం వెల్లడి అవుతున్నది. సమాఖ్య వ్యూహాత్మకంగా చిన్ని చిన్ని అడుగులే వేస్తున్నది. సైద్ధాంతిక సమాఖ్య తనను తాను తిరిగి మూల్యాంకనం చేసుకొని, ఆశయాదర్శాలను తిరిగి నిర్వచించుకొని, కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని, దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు సాగాలి.
కొత్త ఆలోచనలను జాతి ముందుంచి, నాయకత్వం వహించడంలో తెలుగువారు ఎప్పుడూ అగ్రగణ్యులే. భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల ఏర్పాటుకై ఉద్యమించి తెలుగువారు చరిత్రకెక్కారు. స్నాతకోత్తర విద్య దాకా తెలుగు మాధ్యమాన్ని చేపట్టినా, ప్రపంచీకరణ నేపథ్యంలో పరమపద సోపానపటంలో వలె పైదాకా వెళ్లి క్రిందకు జారిపోతున్నా అది మనకే చెల్లింది. యునెస్కో వారి పిలుపునందుకొని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి ఉద్యమించడంలోనూ మనమే ముందున్నాం. ఇప్పుడు ఈ సమస్య తీవ్రతను గుర్తించి దేశం మొత్తం మీద మాతృభాష మనుగడకు, అభివృద్ధికీ ఒక జాతీయ భాషా విధానాన్ని చేపట్టవలసిన అగత్యాన్ని కేంద్రప్రభుత్వం చేత గుర్తింపుజేసేందుకు కూడా మనమే ఉద్యమించాలి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|