|
|
Articles: My Thoughts | ఈ తెగులు పోతుందా? - Site Administrator
| |
చాల్లే. ఊరుకో. ఉన్నదంతా ఉండగా నీ కన్ను ఈ చిన్న కాన్వెంటులపైన పడిందేమిటి? శాసనసభలనూ, న్యాయస్థానాలనూ, కార్యాలయాలనూ, విశ్వ విద్యాలయాలనూ, కాలేజీలనూ, హైస్కూళ్ళనూ తెలుగువైపు మళ్ళించే ప్రయత్నంలో వున్నాం. ఈ కాన్వెంట్లతో వచ్చిందా నీకు బెడద? పిచ్చుకపైన బహ్రాస్త్రమా?
కాదండీ బాబూ అది పిచ్చుక కాదు, రాబందు, గండభేరుండం. ఎలాగో వివరించమంటారా? ప్రతిమాటా జాగ్రత్తగా ఆలకించండి.
మన పిల్లలకు తెలుగు అక్షరాలు ఏ వయస్సులో నేర్పుతున్నాం?
ఐదేండ్లు దాటిన తరువాత ఒకటో తరగతిలో అమ్మబొమ్మను చూపి `ఆ' ను, ఆవు బొమ్మను చూపి `ఆ' ను నేర్పుతున్నాం. నేర్పుతున్నామంటే అక్షరం ఎక్కడ మొదలు పెట్టి ఎలా నడిపించుకుంటూ వెళ్ళి ఎక్కడ అంతం చేయాలో నేర్పడం లేదు. బొమ్మలో ఉన్న అక్షరరూపం కాగితం పైన కనబడితే చాలు. ఉ, ఐ, ఘ, త, శ, ళ, డ, ణ మొదలైన అక్షరాలను మన పిల్లలు ఎలా రాస్తున్నారో ఒకటో తరగతి పిల్లల్ని గమనించి చూడండి.
సరే. అది వేరే సంగతి.
ఇంగ్లీషు అక్షరాలను మనం మన పిల్లలకు ఏ వయస్సులో నేర్పుతున్నాం? ఒకటో తరగతి కంటే ముందు యు.కె.జి. దానికంటే ముందు ఎల్.కె.జి. దానికంటే ముందు నర్సరీ క్లాసు (బేబీక్లాసు) అనే మూడు సంవత్సరాల కాన్వెంటు చదువు ఉంది కదా. అదిగో ఆ నర్సరీ క్లాసులో ఎ.బి.సి.డి.లు రాయిస్తున్నాం. అంటే రెండేండ్లు పూర్తై మూడవ సంవత్సరంలో పడగానే ఇంగ్లీషు అక్షరాలు నేర్పుతున్నాం. ఇది తెలుగు వృక్షాన్ని వేర్ల వద్ద కొరికివేయడం కాదా?
పిల్లలు యు.కే.జి పూర్తి చేసేసరికి ఇంగ్లీషులో చిన్న చిన్న వాక్యాలు రాయగలుగుతున్నాడు - తెలుగు అక్షరాలు రావు. ఇంగ్లీషులో నూరు వరకు అంకెలు చెప్పడం, చిన్న కూడకిలూ, తీసివేతలూ, ఎక్కాలూ ఇంగ్లీషులోనే నేర్చుకుంటున్నాడు. తెలుగులో అంకెలు వరుసగా పదిపైన చెప్పలేడు. అంకెల విషయంలో పల్లెప్రాంత పిల్లలు ఫరవాలేదు కానీ పట్టణ ప్రాంత పిల్లలు మరీ అన్యాయం. నేను ఏదో ఊహించి చెప్పడం లేదు మీ మీ పిల్లలను పరీక్షించి చూచుకోండి.
| Read 6 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|