|
|
Articles: My Thoughts | పంటలపై విదేశీ పెత్తనం - Site Administrator
| |
గతంలో ఆ సంస్థలన్ని ప్రజా సంస్థలు. ఆ సంస్థల పరిశోధనలశాలల్లోకి విద్యార్థులు, రైతులు ఎవరైనా వెళ్ళవచ్చు. చూడవచ్చు. తమ సందేహాలు తీర్చుకోవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఆ పరిశోధన సంస్థలన్ని రహస్య సంస్థలయ్యాయి. అక్కడ జరుగుతున్న పరిశోధన రహస్యమే. శాస్త్రజ్ఞులు తమ మేథను విదేశీసంస్థలకు అమ్ముకున్నారు. ఆ పరిశోధన సంస్థల్లో గత 20 ఏళ్ళుగా కొత్త ఉద్యోగులను నియమించలేదు. పాతతరంలో ఉత్సాహం చచ్చిపోయింది. ఇప్పుడంతా వారిది 'ఔట్ సోర్సింగ్'
కంప్యూటర్ రంగంలో ఏ విధంగా విదేశాల నుండి ప్రాజెక్టులు తెచ్చుకుని, పనిచేయించి, ఫలితాలను తిరిగి అందిస్తున్నారో అదే విధంగా వ్యవసాయ పరిశోధన సాగుతున్నది. 'మన్ శాంటో' లాంటి సంస్థ ప్రాజెక్టు యిస్తుంది. ఆ ప్రాజెక్టుని తన పరిశోధనశాలలో నిర్వహించి, ఫలితాలను తిరిగి గొప్పగా ఆ సంస్థకు అందించాలి. వీరి పరిశోధనలను ఆ బహుళజాతి సంస్థ ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేసుకుంటుంది. ఇటువంటి 'ఔట్ సోర్సింగ్'ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ప్రభుత్వ శాఖలు నిధులు ఇవ్వలేవు కాబట్టి మీ నిధులు మీరు సమకూర్చుకోమన్నది మంత్రులు చెప్పేమాట. ఆ మాట ప్రకారం సైంటిస్టులు బహుళజాతి సంస్థలకు బానిసలవుతున్నారు. ఇప్పుడు మనదేశ వ్యవసాయ శాస్త్రవేత్తలు సమగ్రంగా పనిచేసేవారు కాదు. వారిది బానిస పరిశోధన. ఈ విషయం ఇటీవల 25 మంది శాస్త్రవేత్తలు అమెరికా నుండి రాసిన ఉత్తరంలో బహిర్గతం చేశారు.
మమ్మల్ని బహుళజాతి సంస్థలు సంకెళ్ళువేసి బంధించాయి. వారు కోరుతున్న జెనిటికల్లీ మాడిఫైడ్ (జి.ఎమ్) ఫుడ్ మీద పరిశోధనలు చేయాల్సి వస్తున్నది. మాకు ఇష్టం లేదన్నా వినకుండా ప్రభుత్వంచేత వత్తిడితెచ్చి చేయిస్తున్నారు అన్నది ఆ శాస్త్రవేత్తల మనోవేదన. ఇటువంటి తెగింపు మన దేశంలోని వ్యవసాయ విద్యాలయాలనుండి, పరిశోధకుల నుండి ఇంకా రావాల్సి ఉంది. వ్యవసాయమంతా బయోటెక్నాలజీ సంస్థల జాబితాలోకి వెళుతున్నది. బయోటెక్నాలజీ (బి.టి) సంస్థలు కోట్లు కుమ్మరిస్తున్నాయి. మనదేశంలోని అత్యున్నత స్థాయి అధికారులు, మంత్రులు, శాస్త్రవేత్తలకు ఆ సంస్థలు డబ్బులు ముట్ట చెబుతున్నాయి. భారతదేశ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసిఎఆర్)లో ఏం జరగాలో బిటి సంస్థలు ముందే నిర్ణయిస్తారు. ఐసిఎఆర్ లో జరిగిన పరిశోధకుల ఉద్యోగ ఇంటర్వ్యూలలో బిటి కంపెనీ ప్రతినిధులు కూర్చుని, తమకు అనుకూలమైన వారిని ఎంపిక చేయించారు. ఇక ఆ పరిశోధకులు ఐసిఎఆర్ ని క్రమంగా బిటి కంపెనీలకు దగ్గర చేస్తారన్నమాట.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|