|
|
Articles: My Thoughts | ఐవిఎస్ అవిరళ కృషి - Site Administrator
| |
తమిళభాషా శాస్త్రవేత్త అయినా ద్రావిడ భాషా శాస్త్రం మీది మక్కువ తొలిసారిగా కేరళరాష్ట్రంలో కేరళ విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్రాధ్యయనానికి తొలిశాఖ ప్రారంభించేలా పురికొల్పింది. ప్రాచార్య వి.ఐ.సుబ్రహ్మణ్యంగారు ఎన్నో సంస్థలను ప్రారంభించినవారు. అందులో కొన్ని...
'ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ తమిళ్ రీసెర్చ్, చెన్నై'
'ది ఇంటర్ నేషనల్ స్కూల్ ఆఫ్ ద్రవిడియన్ లింగ్విస్టిక్స్'
'ద్రవిడియన్ లింగ్విస్టిక్స్ అసోసియేషన్' పేరిట ద్రావిడభాషా శాస్త్రాధ్యయనానికి ప్రత్యేక సంస్థ నేర్పరచి, ప్రారంభక కార్యదర్శిగా బాధ్యతలు వహించారు.
'ద్రవిడియన్ లింగ్విస్టిక్స్ కాన్ఫరెన్స్' ఏటా జరిగే ఉత్సవం. ఇది వీరి వ్యవహార దక్షతకొక నిదర్శనం. జాతీయ సదస్సుల్లో పత్రాలు ఒక పుస్తకంగా వెలువడటమే విశేషం. అది ఎడతెగక రావటం మరొక విశేషం. క్రీ.శ.1972 నుంచి వీరి సంపాదకత్వంలో వెలువడుతున్న 'ది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ద్రవిడియన్ లింగ్విస్టిక్స్' ప్రచురణ సకాలంలో వాసిలో తగ్గకుండా వెలువడుతోంది.
ద్రావిడ భాషాశాస్త్రంలో ప్రాచార్య వి.ఐ.సుబ్రహ్మణ్యంగారి విశిష్టసేవను గుర్తించి జాఫ్నా విశ్వవిద్యాలయం, తమిళ విశ్వవిద్యాలయం, రవీంద్ర భారతి, మద్రాసు విశ్వవిద్యాలయం, దక్కన్ కాలేజి, ద్రావిడ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు పట్టా ప్రదానం చేశాయి. రాక్ ఫెల్లర్ సొసైటీవారి సీనియర్ ఫెలోషిప్, శ్రీరామసుబ్రహ్మణ్య రాజా అవార్డు, కలైంజరు విరుదు, తమిళ్ చెమ్మల్ వంటి బిరుదులు ఆయన కీర్తికెత్తిన పతకాలు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|