|
|
Articles: My Thoughts | ఈ తెగులు పోతుందా? - Site Administrator
| |
ఇక ప్రాథమిక పాఠశాలలో ప్రవేశిద్దాం. ప్రైవేటు పాఠశాలలన్నీ ఇంగ్లీషు మీడియం స్కూళ్ళే. అక్కడ పిల్లలు ఒకటో తరగతిలో తెలుగు అక్షరాలూ, గుణింతాలూ రాసుకుంటూ ఉండగా ఇంగ్లీషులో వాక్యాలు రాస్తున్నాడు. రెండవ తరగతిలో తెలుగులో చిన్న చిన్న వాక్యాలు రాస్తూ ఉండగా ఇంగ్లీషులో పెద్ద పెద్ద పాఠాలు చదివేస్తున్నాడు. లెక్కలూ, సైన్సూ, సోషల్ స్టడీస్ మొదలైనవి అన్నీ ఇంగ్లీషులో చదివేస్తున్నాడు. నేను చెబుతున్న విషయాలపై సందేహాలుగానీ, ఆసక్తిగానీ ఉన్నవారు కాస్త శ్రమ తీసుకొని ఐదవ తరగతి ఇంగ్లీషు మీడియంలోని అన్ని పాఠ్యగ్రంథాలనూ, తెలుగు పాఠ్యపుస్తకాలు ఎలాంటి స్థాయిలో ఉన్నాయో గమనించండి. తెలుగు మాతృభాషగా ఉన్న దేశంలో తెలుగు పాఠ్యగ్రంథాలు ఈ విధమైన స్థాయిలో ఉంటే తెలుగువృక్షం వేర్లు తెగకుండా ఎట్లుంటాయి? తెలుగు చెట్టు వాలిపోకండా ఎట్లా నిలబడుతుంది?
ప్రస్తుతం మనరాష్ట్రంలో ప్రతిగ్రామంలోనూ, ప్రతిచిన్న పల్లెలోనూ కాన్వెంట్లు వెలిశాయి. అక్కడ పదో తరగతి, ఇంటరూ చదివినవాళ్ళు తమకు తెలిసిన అరకొర ఇంగ్లీషులోనే పిల్లలకు నేర్పుతున్నారు. తెలుగు ఒక్క అక్షరం చెప్పడం లేదు. ఆ కాన్వెంటులలోనే ఆ టీచర్లే పిల్లలను ఇంగ్లీషు మీడియంలో అయిదో తరగతి వరకూలాగించేస్తున్నారు. గవర్నమెంటు ప్రాథమిక పాఠశాలలో తెలుగు మీడియమే ఉండడం వల్ల అక్కడ చదివే పిల్లల సంఖ్య బాగా తగ్గిపోయింది. గోరుచుట్టుమీద రోకటిపోటులాగా ప్రభుత్వం ప్రభుత్వ రంగ పాఠశాలలలో కూడా ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టింది. ఇంగ్లీషు టెక్ట్స్ బుక్ ఇంగ్లీషు మీడియం సైన్సు, సోషల్ స్టడీస్, లెక్కలు పుస్తకాల సరసన తెలుగువాచకం ఎంత నాసిరకంగా ఉందో పోల్చి చూడండి.
ఇప్పుడు మన రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులలో డెబ్బై శాతం మందికి పైగా ఇంగ్లీషు మీడియంలో చదువుతున్నారు. ప్రభుత్వ రంగ పాఠశాలలో కూడా పూర్తిగా ఇంగ్లీషు మీడియం అమలుపరిస్తే ఇంగ్లీషు విద్యార్థుల సంఖ్య ఎనబై, తొంబ్బై శాతానికి చేరుకుంటుంది. అలా చదివి ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళను తెలుగులోనే ఉత్తరప్రత్యుత్తరాలు రాయాలని శాసిస్తే మేం ఇంగ్లీషు మీడియంలో చదివాం. మమ్మల్ని తెలుగులో రాయమనడం అన్యాయం అని ఉద్యమిస్తారు. తెలుగు చదివినవాడుంటే కదా తెలుగులో రాయడానికి. ఇది దాదాపు పది సంవత్సరాలలో మన రాష్ట్రం ఎదుర్కోబోయే సమస్య.
| Read 6 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
![](../images/spacer.gif) |
Advertisements |
|
![](../images/spacer.gif) |
![](../images/spacer.gif) |
Advertisements |
|