|
|
Articles: TP Features | భవితనూ కాపాడుకోవాలి - Site Administrator
| |
ప్రజల్లో తెలుగువాళ్ళమనే భావోద్వేగాన్ని కాపాడటం కోసం పై మెరుగుల ప్రచార కార్యక్రమాల్ని నిర్వహిస్తూ, భాష మూలాలను అన్ని విధాలుగా నరికివేస్తున్న ఘనత నాటి, నేటి పాలకులదే. సమకాలీన ప్రయోజనాలకు అనుగుణంగా భాషను అభివృద్ధి పరచే చర్యలు చేపట్టడానికి ఈ ప్రభుత్వాలు ముందుకు రాకపోవడానికి ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులే కారణం. అందుకే ప్రజల భాషను కనీసం పాలనా భాషగా కూడా ఎదగనివ్వరు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అనతి కాలంలోనే ఏదో ఒక సందర్భంలో ప్రజలకు ఇంగ్లీషు వచ్చు గనుక వారి మాతృభాషలోనే పరిపాలించాలనే నియమం ఏమీ అక్కర్లేదని న్యాయస్థానాలు తీర్పు ఇవ్వవచ్చు. రాజ్యాంగం ఇచ్చిన అవకాశాలకు, ఆశించిన లక్ష్యాలకు లోబడి, సామాజిక ప్రయోజనాన్ని ఉద్దేశించిన తీర్పులు ఇకపై వస్తాయని మనం ఆశించలేం.
ఈ పరిస్థితుల్లో భాషోద్యమకారులు, తెలుగుజాతి ఆత్మగౌరవవాదులు, ప్రజల కోసం ఆలోచించే జాతీయవాదులు, ప్రజాస్వామ్య ప్రియులు, వామపక్షవాదులు ఏం చెయ్యాలో ఆలోచించాలి. అన్ని కోణాల నుంచీ సమస్యను ఆలోచించాలి. ప్రభుత్వం విద్యారంగ బాధ్యతల్నుంచి అన్ని స్థాయిలలో తప్పుకోవడాన్నీ, ప్రజాభాషల్ని బలహీనపరచడాన్నీ తీవ్రంగా నిరసించాలి. వాటి ధోరణుల్ని మార్చడానికి ఏం చెయ్యాలో అంతా చెయ్యాలి. ఇప్పుడు భాషోద్యమమంటే జాతి ఆత్మగౌరవ రక్షణకే కాదు, అంతర్జాతీయ మార్కెట్ శక్తుల నుంచీ, ఆర్థిక - సాంస్కృతిక రంగాలలో ప్రపంచ ప్రజలను బానిసల్ని చేయడం ద్వారా శాశ్వత పెత్తందార్లుగా మారచూస్తున్న అంతర్జాతీయ రాజకీయ శక్తుల నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి అందరూ కలిసి ఆలోచించాలి. కలిసి ఉద్యమించాలి.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|