|
|
Articles: TP Features | ఓంకారమయం సైన్స్! - Dr. Subrahmanyam Vangala
| |
అంతే కాదు, మన శరీరంలో అన్ని అవయవాలలోనూ ఉన్న జీవకణాలలోనూ, అవే ముప్పయివేల జీన్స్ ఉంటాయి. కానీ, ప్రతి అవయవంలోనూ అన్ని జీన్స్ ఉపయోగపడవు. అందుకే, ప్రతి అవయవమూ వేరే వేరే పనులు చేయగలుగుతున్నాయి. అంతే కాదు, శరీరంలోని అన్ని అవయవాలూ ఒకదానికొకటి సహాయపడుతూ మన శారీరకారోగ్యానికీ, మానసికారోగ్యానికీ దోహదపడుతున్నాయి. ప్రపంచంలో చాలా మంది శాస్త్రవేత్తలు, జీన్స్ పంపే సందేశాలను ఫంక్షనల్ జీనోమిక్స్ (functional genomics) ద్వారా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ జీవకణంలో జరిగే పనులన్నింటినీ అర్థం చేసుకోవడానికి ఇంకా ఎంత కాలం పడుతుందో తెలీదు. ప్రస్తుతానికి అర్ధమయ్యింది ఏమిటంటే, జీవకణంలోని ఏ భాగమైనా తన విధిని సక్రమంగా నిర్వర్తించలేకపోతే, మనిషి అనేక రోగాలకు గురి అవుతున్నాడు. అన్నింటిలోకీ భయంకరమైన వ్యాధి రాచపుండు (క్యాన్సర్) మనకందరికీ సుపరిచితమే. ఒక మాటలో చెప్పాలంటే, జీవకణం అల్లకల్లోలమైపోయిన మూలంగానే మనిషి రోగగ్రస్తుడు అవుతున్నాడు.
ఏ మతంలో అయినా దేవుడు ఏదో ఒక రూపంలో మనిషి అవతారంలో భువికి దిగి వస్తున్నాడు. రామ, కృష్ణ, మహమ్మద్, క్రీస్తు, బుద్ధ, ఇంకా ఎంతో మంది మహాపురుషులు దేవుడి సందేశాన్ని సామాన్య మానవునికి అందిస్తున్నారు. మతం మతానికీ ఈ సందేశాలు వేరైనప్పటికీ, తొంభై శాతం మంది ప్రజలు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ఎక్కడైనా సక్రమంగా నిర్వర్తించకపోయేసరికి, ప్రపంచం అల్లకల్లోలమైపోతుంది. ఎవరి మతం గొప్పది అనే తర్కాలతో, మానవుడు తనలోనే ఉన్న దేవుడిని గుర్తించలేకపోతున్నాడు. యుద్ధాలతో, పరస్పర వైరుధ్యాలతో, మానవులు ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. అదే కాక, చాలా మంది, మితిమీరిన ధూమపానం, మద్యపానం, భోజనం, వాతావరణ కాలుష్యాలతో తమలోనే దాగి ఉన్న దేవుడిని నిత్యమూ గాయపరుస్తూనే ఉన్నారు. అంటే, జీన్స్ గాయపడి వాటి విధిని సక్రమంగా నిర్వర్తించలేకపోవడమన్న మాట.
మన వాతావరణంలో ఉండే ఆక్సిజెన్ (oxygen), నీరు, సూర్య కిరణాలు, మరెన్నో, జీవకణాలు సక్రమంగా పనిచేయడానికి అత్యవసరమైన పదార్ధాలు. అందుకే హిందూ మతస్థులు దేవుడు సర్వాంతర్యామి అంటారు. వాతావరణ కాలుష్యం, మితిమీరిన వ్యసనాలు, ఆక్సిజన్ ని, జీవకణానికి శత్రువుగా మారుస్తున్నాయి. ఇంకా, మన శరీరానికి అత్యవసరమైన కొవ్వు పదార్ధం కూడా జీవకణానికి శత్రువుగా మారుతుంది. ఆక్సిజన్, కొవ్వు పదార్ధం, ఫ్రీ రాడికల్స్ (Free radicals) గా మారి మన జీవకణంలోని 'ఓం'కారాన్ని గాయపరుస్తున్నాయి. దీనినే 'ఆక్సిడేటివ్ డి.ఎన్.ఎ డేమేజ్' (oxidative DNA damage) అని శాస్త్రజ్ఞులు అంటారు.
| Read 31 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|