|
|
Articles: Short Stories | ఎంజాయ్ - Site Administrator
| |
అసలు రిలాక్స్ అవడం అంటే ఏమిటో ఇద్దరికీ తెలియదు. ఇప్పుడొక్కసారిగా అంతా ఖాళీ. ఏ పనీలేని పరిస్థితి. ఇప్పుడు ఎంజాయ్ చెయ్యాలంటే ఎలాగో వాళ్ళిద్దరికీ తెలియటం లేదు. ఎలా అన్నప్రశ్న ఒక భూతంలా వాళ్ళముందు నిలబడింది.
మొన్న చలపతి అన్నాడు సుమతీ, టైము గడవాలంటే హాయిగా ఏసి థియేటర్ లోకి వెళ్ళి కూర్చోవాలని. ఒక పూటంతా గడిచిపోతుంది. నిజమే సినిమా రెండు మూడు గంటలు... రానూ పోనూ ప్రయత్నం మరో గంటతో సగం రోజు ఇట్టే గడిచిపోతుంది.
అసలు వాళ్ళీ మధ్య పదేళ్ళ నుంచి సినిమాలు చూడడం మానేశారు. మరిప్పుడు కాలం గడవడానికి సుమతి, శంకర్రావు ఇద్దరూ సినిమాకి బయల్దేరారు. థియేటరు దగ్గరున్న జనాన్ని చూసి హడలిపోయారు. సినిమా పేరు `ధర్మరాజ్యం' రామరాజ్యం గురించి విన్నారు కాని, ఈ ధర్మరాజ్యమంటే ఏమిటో, రామరాజ్యంలో ధర్మాలకీ, ధర్మరాజ్యంలో ధర్మాలకీ పోలికేమిటో, తేడాలేమిటో తెలుసుకోవాలని ఇద్దరూ స్థిరనిశ్చయంతో కూర్చున్నారు.
సినిమా మొదలయి హీరో తెర మీద కనిపించగానే చెవులు చిల్లుపడేట్లు శబ్దాలు. హడలిపోయారిద్దరూ. ఏమిటా అని చూస్తే ఆ సినిమాలో హీరో అభిమానులట. వాళ్ళ అభిమాన నాయకుడు తెరమీద కనిపించగానే గంగవెర్రులెత్తినట్లు కేకలు, గెంతులు, చేతిలో ఉన్న దండలు తెరపైకి విసరడాలూ, ఈలలూ ఇవన్నీ సద్దుమణిగే సరికి సినిమా పావుగంటయిపోయింది. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని సినిమా మీద దృష్టి సారించారు శంకర్రావు, సుమతి.
తీరా చూస్తే ధర్మరాజ్యమంటే ధర్మారావు అనే పేరుగల వ్యక్తి ఈ ప్రజాప్రభుత్వంలో తనకి తానుగా సార్వభౌమత్వాన్ని ప్రకటించుకుని, తనకి తోచినది న్యాయంగా చేసినది ధర్మంగా పరిపాలించడమే ధర్మరాజ్యమని వాళ్ళకి అర్థమయ్యేసరికి సినిమా ఇంటర్వెల్ కి వచ్చేసింది. అప్పటికే హీరో నలుగురు హిరోయిన్లతో విదేశాల లొకేషన్లలో డాన్సులు చేసేశాడు.
సినిమాల్లో ఫైట్లు ఎలాగో కష్టపడి చూశారు కానీ, హీరో హీరోయిన్ల డాన్సులు మటుకు చూడలేకపోయారు శంకర్రావు, సుమతీను. ఆ పాటేంటో అర్థం కాలేదు సరే... అదలా ఉంచి మిలటరీ కవాతుల్లా వాళ్ళిద్దరి వెనకాల ఇటో అరవై మంది, అటో ఇరవై మంది ఎగస్ట్రాలు. వాళ్ళెవరో అక్కడికెందుకొచ్చారో అర్థం అవడం మాట అటుంచి పాట మధ్యలో ఆర్కెస్ట్రా వచ్చే టైముకి థియేటర్లో స్టీరియో సౌండు.
మరింక తట్టుకోలేకపోయారిద్దరూ. నెమ్మదిగా లేచి ఇంటికొచ్చేశారు. ఆ సౌండ్ కి వాళ్ళ మెదళ్ళు ఎంత జామ్ అయిపోయాయంటే వచ్చేటప్పుడు రెండుచోట్ల ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నట్టుగాని, ఆ రోడ్ల మీద పోయే వాహనాల పోరు కానీ ఏదీ వాళ్ళ బుర్రల్లోకి వెళ్ళలేదు. ఇంటికొచ్చి తలుపులన్నీ వేసుకుని అరగంట సేపు కళ్ళు మూసుకుని పడుకుంటే కాని ఇద్దరూ మామూలు స్థితిలోకి రాలేకపోయారు. వచ్చాక మళ్ళీ జన్మలో థియేటర్ కు వెళ్ళి సినిమా చూడకూడదని ఒట్టు పెట్టేసుకున్నారు.
| Read 5 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|