|
|
Articles: Short Stories | యోగం - Mr. Satyam Mandapati
| |
సూర్యం ఓ క్షణం ఆగి చెప్పడం ప్రారంభించాడు. అవును రమేష్! ఈ కథ నిజంగా జరిగిందే - కథలాగానే చెబుతాను వివు - ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత - పందిరి దగ్గర తవ్వుదామని శ్రీరాం నిశ్చయించుకున్నాడు. స్నానం చేసి ముందుగదిలో తల దువ్వుకుంటున్న శ్రీరాంకి పెరట్లో నుంచి పెద్ద గావుకేక వినపడింది. చకచకా పెరట్లోకి వచ్చిన శ్రీరాం ఆ దృశ్యం చూసి, నిర్ఘాంతపోయాడు. నోట మాటరాలేదు. సన్నజాజి పందిరి దగ్గర ఆడుకుంటున్న మూడేళ్ళ ముద్దుల రాజు క్రిందపడి వున్నాడు. గిలగిలా కొట్టుకుంటున్నాడు... కొంచెం దూరంలో సరసరా పాకుతూ వెడుతున్న పొడుగాటి నల్లత్రాచు పాము కూడా కనబడింది. అన్నింటికన్నా శ్రీరాం దృష్టి నాకర్షించిది - ఆ పాముకి భక్తితో నమస్కారం చేస్తూ స్థాణువులా నుంచున్న జానకమ్మ!
ఆమె ప్రక్కనే చేతిలో కర్ర వున్నా, పాము మీద దెబ్బవేయటానికి భయపడి నుంచున్న పాలేరు అప్పన్న - తర్వాత వాళ్లు చెప్పినదాన్ని బట్టి తెలిసిందేమిటంటే - రాజా అక్కడ ఆడుకుంటున్నప్పుడు, వాడి దగ్గరకు పాము రావటం వాళ్లు చూస్తూనే వున్నారు. రాజాని దూరంగా తీసుకుపోలేదు సరికదా, కనీసం పాము మీద ఒక దెబ్బ కూడా వేయలేదు వాళ్ళు. పైగా 'నాగరాజస్వామీ, సుబ్రమణ్యస్వామీ' అంటూ నమస్కారాలు పెడుతూ నుంచున్నారు ఆ మూఢులు, అమాయకుడైన పసిపిల్లవాడి ప్రాణాలు తీసిన హంతకులు. వాళ్ళు మనుషులు కాదు - రాక్షసులు - సూపస్టిషస్ బార్బేరియన్స్' సూర్యం కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
సూర్యం ఎందుకలా ఆవేశపడతావ్ - కామ్ గా వుండు - చెప్పు అసలిది ఎక్కడ జరిగింది? రమేష్ సూర్యం భుజం మీద చేయి వేస్తూ అడిగాడు.
'ఎక్కడో కాదు - మా ఇంట్లోనే జరిగింది. ఆ కథలో శ్రీరాం ఎవరో కాదు రమేష్, నేనే - నేనే. ఆ కథలో రాజా ఎవరో తెలుసా? నా ముద్దుల అందాల రాజా - నేను అమితంగా ప్రేమించిన నా తమ్ముడు. మూడేళ్ళ అమాయకపు పసివాడు. వాళ్ళ మూఢనమ్మకాలకి అన్యాయంగా ఆహూతి అయిపోయాడు రాజా - అదే రమేష్ వాడికి పట్టిన యోగం - రాజయోగం' చేతుల్లో ముఖం దాచుకున్నాడు సూర్యం.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|