|
|
Articles: Short Stories | పే పాల్ - Site Administrator
| |
విలియం ఫాక్స్ కూ సురేష్ కూ మధ్య నడిచిన ఈ మెయిల్స్ ను, పేపాల్ వాళ్ళు పంపిన చెక్కుల ఓచర్లను, విలియం ఫాక్స్ కు సురేష్ డబ్బు పంపిన రసీదులను లాయరుకు చూపించాడు.
అంతా పరిశీలించిన లాయరు, 'దొంగ క్రెడిట్ కార్డులని తేలడంతో, క్రెడిట్ కార్డ్ కంపెనీలు పేపాల్ వాళ్ళను, తామిచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేయమంటున్నారు. పేపాల్ వాళ్ల క్రెడిట్ కార్డుల వాళ్ళకు డబ్బు ఇచ్చేసి, ఇప్పుడు మీ వెనుక పడ్డారు' అన్నారు, కళ్ళద్దాలను పక్కన పెడుతూ.
'ఆ విషయం మాకూ అర్థమైంది... నీకు ఫీజిచ్చి మరీ అదే విషయాన్ని తెలుసుకోవడానికి మేమిక్కడకు రాలేదు' అని మనసులో అనుకొని, పైకి మాత్రం, 'మరి ఆ డబ్బును నేను విలియం ఫాక్స్ కు పంపేశానుగా' అన్నాడు.
'ఎలా పంపావు... చెక్కు రూపంలోనా?' అన్నాడు లాయర్.
'కాష్ ట్రాన్సాక్షన్... వెస్ట్రన్ యూనియన్ కంపెనీ ద్వారా'
'నువ్వు కష్టమర్లకు సాఫ్ట్వేర్ సీడీలను షిప్ చేసినట్లు లిఖితపూర్వకమైన ఆధారాలేమైనా ఉన్నాయా?!
'లేవు.... నేను కేవలం మధ్యవర్తిని. నాకు నా నేనే కష్టమర్లకు సీడీలు షిప్ చేయలేదు. అదంతా ఆ కంపెనీ చూసుకుంటుంది' చెప్పాడు సురేష్.
'బహుశా అసలా కంపెనీయే ఉండి ఉండకపోవచ్చు'అన్నాడు లాయర్.
మరిప్పుడెలా? అడిగింది సుజాత.
'మీరు పెద్దగా చేయగలిగిందేమీ లేదు...' అన్నాడు లాయర్, సురేష్ ఇచ్చిన పేర్లను తిరిగి ఇచ్చేస్తూ.
'అంటే పేపాల్ వాళ్ళకు మేమే డబ్బు కట్టేయాలంటారా?!' అడిగాడు సురేష్.
'అవును... ఆ విలియమ్ ఫాక్స్ గానీ ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవాడో అయితే... మీరు కావాలనే ఈ ఫ్రాడ్ చేసి, నిధుల్ని వాడికి అందించారని ప్రభుత్వం మీ మీద కేసు పెట్టొచ్చు. విలయం ఫాక్స్ అలాంటి వాడు కాకూడదనుకుంటున్నాను నేను' అన్నాడు లాయర్.
0-0-0
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|