|
|
Articles: Short Stories | సామాన్యుడి కోరిక - Site Administrator
| |
ఎక్కడో అంతరాలయంలో శిలారూపంలో నిలబడి ఉండే సామి మిరుమిట్లు గొలిపే కాంతులతో అతని ఎదురుగా నిజరూపంతో ప్రత్యక్షం కావడమే!
'అయ్యబాబోయ్... అయ్యోరు... మీరు నిజంగానే ప్రత్యక్షమయ్యారా... ఏమి నాభాగ్యం' అంటూ చెంపలు వాయించుకుంటూ దండాలు పెట్టేస్తున్నాడు ఆ సామాన్య ఓటరు. 'నాయనా! కంగారు పడకు. ఇలా నీకు నేను కనపడడానికి కారణం. నువ్వు కోరుతున్న కోరికే...' అన్నారు స్వామి.
'అయ్యబాబోయ్. నేనేమన్నా తప్పుడు కోరిక కోరానా అయ్యోరు? క్షమించండి సామీ...' అంటూ మరోసారి కంగారు పడిపోయాడా సామాన్య ఓటరు. 'అది కాదోయ్... నువ్వు ఏ పార్టీకి మెజార్టీ రాకూడదని కోరుకున్నావే... అదే నాకాశ్చర్యాన్ని, అనుమానాన్ని కల్గించింది. అది నివృత్తి చేసుకోవడానికే ఇలా నీ ముందుకు వచ్చాను. ఇంతకీ నీవలా ఎందుకు కోరుకున్నావు' అడిగాడు స్వామి.
అదా అయ్యోరూ? ఏం సెప్పమంటారు సామీ మా పాట్లు... పెద్ద మెజారిటీతో నెగ్గిస్తే మా సెడ్డతలపోటయిపోతోంది. అధికారంలో ఉన్నోళ్ళేమో ఆ ప్రోజెక్టులంటారు... ఏవో పథకాలంటారు... ఇళ్ళు కట్టిత్తామంటారు... భూములు పంచిపెడతామంటారు. ఈ ప్రతి పక్షమోళ్ళేమో అందులో అన్ని కోట్లు తినేశారు, ఇళ్ళన్నీ మీ పార్టీ ఓళ్ళకే ఇచ్చుకున్నారు. పనికి రాని బూములేమో మా పార్టీ ఓళ్ళకిచ్చారు. అంటూ గగ్గోలు పెడుతారు.
అక్కడ అసెంబ్లీలో నేమో బల్లలు ఇసురుతారు, మైకులు ఇరగ్గొడతారు, అరుసుకుంటారు, కసురుకుంటారు. బయటకొచ్చేశాక వాళ్ళూ వీళ్ళూ కలిసి వ్యాపారాలు చేసుకుంటారు, కాంట్రాక్టులు చేసుకుంటారు. ప్రజలు సొమ్ముల్నేమో బాగానే పంచుకుంటారు. మధ్యలో మేమే వెర్రి వెధవలం. మమ్మల్ని పట్టించుకొనే వాడే అగుపడ్డు. ఇదిగో... ఇలా ఓట్లు కావాల్సొచ్చినప్పుడు మాత్తరం మేం జ్ఞాపకమొస్తాం. అబ్బో ఇలాంటప్పుడు ఎన్ని సేవలైనాచేత్తారు. ఎలాంటి యాషాలైనా ఏస్తారు. ఎక్కడలేని ఆప్యాయతల్నీ ఒలకపోస్తారు. మామూలప్పుడు కంటితో సూడ్డానికే ఇష్టపడని మా బుడ్డోళ్ళని ఎత్తేసుకుంటారు. ముద్దులాడేత్తారు. మా ముసలోళ్ళని, ముతకోళ్లనీ ప్రేమగా పలకరించేస్తారు. కోడలు బాగా చూస్తున్నదా... కొడుకు కూడు పెడుతున్నాడా.... అంటూ కుశల ప్రశ్నలు వేస్తారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|