|
|
Articles: Short Stories | నేను నా బిఏ! - Miss rajeswari rajeswarinedunuri
| |
అంతకంటే ఏం కావాలి? అలా అమాంతంగా వెళ్ళి కార్లో కూర్చున్నాను.
డియర్...కాస్త చీరైనా మార్చుకో. బొత్తిగా వంటమనిషిలా ఉన్నావ్.
ఇక అన్నదే చాలని గబగబా ముఖం కడుక్కుని చీర మార్చుకుని వీలైనంత తొందరగా కార్లో పడ్డాను.
ఇదేమిటి? హోటల్ కి ? విస్తుబోయాను హోటల్ ముందు కారాగేసరికి
తమరేమీమితిన్నట్టు లేరు. నీరసంతో నిద్ర వస్తుంది. ముందు టిఫిను.
అప్పుడు గుర్తొచ్చింది. హాల్టికట్టు, పెన్ను, వాచీ ఏమీ తేలేదని. పుట్టెడు దుఃఖం ముంచుకొచ్చింది. వెధవ పరీక్ష వెధవ చదువు. నా ఫేసుకి ఇదొకటే తక్కు.వ నాలో నేనే గొణుక్కున్నాను.
నాకు తెలుసు... నీ మతిమరుపు. ఇంత ఇదిగా రాసినా పాసు కావు. హేంలెట్ కి ఒధెల్లో సీజర్ కి మేక్ బెత్తు రాసి వస్తావ్ ఎందుకొచ్చింది గానీ హాయిగా మ్యాట్నీకి పోదాం పద. అన్ని శాపాలు పెడుతూ ఎంత వత్తినా నీళ్ళు ఇంకని నైలెక్సు చీరని చూసి రుమాలు ఇచ్చి డోంటు వర్రీ డార్లింగ్ అన్నీ తెచ్చాను. ఫ్రెష్ గా ఉండు. ఇవిగో అంటూ డాష్ బోర్డులోంచి అన్నీ తీసి ఇచ్చి.. వెరీసారీ... మనసు పాడుచేశాను. నో టైం అంటూ స్పీడు పెంచారు.
పోనీలే... మొదట ఏడిపించినా మిగిలిన పేపర్లన్నీ బాగానే రాయనిచ్చారు. ఇక రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నాం. నాకయితే ఆశలేదు. ఆ రోజే రిజల్ట్స్. ఇదేమిటి... ఈ రోజసలు పేపరే ఇవ్వలేదు? అనుకుంటూ శ్రీ వారికి ఫోన్ చేద్దామని మానేశాను. తీరా ఇంతోటి ఫెయిల్ ఐతె? ఎందుకులే అని సాయంత్రం మైనరు ఇంట్లోకొస్తూనే అన్నాను.
ఇదేమిటండీ ఈ రోజు రిజల్ట్స్ వస్తాయి కదా అనుకుంటే అసలు మన జడ్డి మొహంగాడు పేపరే ఇవ్వలేదు? అన్నాను.
పిచ్చితల్లీ జడ్డిమొహం వాడు కాదు తమరు. పేపరు నేను దార్లోనే తీసుకుని వెళ్ళాను.
మరి రిజల్ట్స్?
వచ్చాయి
ఫోన్ చేసి చెప్పొచ్చుగా?
చెప్పడానికేముంది?
అంటే పోయిందా?
చూసుకో!
ఆయనగారి చేతిలోంచి ఆత్రంగా పేపరందుకుని థర్డ్ క్లాసంతా వెతికాను. ఎక్కడా నా నెంబరు లేదు. పోయిందండీ! బేలగా అన్నాను.
వెర్రి మొహమా! ఇదిగో నెంబరు అంటూ ఫస్ట్ డివిజన్ లో నా నెంబరు చూపించే సరికి ఉక్కిరి బిక్కిరై అమితానందం ఎంతో ఆశ్చర్యం. వెంటనే ఉక్రోషం వచ్చి 'చీ మీరింత కిరి కిరి పెట్టకపోతే మెరిట్ వచ్చేది'
అందుకే అప్పుడప్పుడూ కాస్త అణచి పెట్టాను. ఇక చదివింది చాలు ముందిప్పుడు సినిమా!
ఇంకే ముంది? పాసయ్యానన్న సంతోషంతో మరి కాస్త పౌడరు స్నో ఎక్కువెక్కువ రాసుకుని ఒకటికి రెండు జడలు వేసుకుని ఇంకొంచెం కాటుక ఎక్కువగా పెట్టుకుని మరింత పెద్దగా బొట్టు పెట్టుకుని ఉన్నంతలో ఖరీదైన చీర కట్టుకుని దొరకని చెప్పుల్ని తొందరగా వెతుక్కుని కార్లో చతికిలబడ్డాను.
ఎలా ఉన్నానో మరి? పదే పదే చూస్తూ మందంగా కదిలారు మా ప్రౌఢతో [ఎంబాసిడర్ని ప్రౌఢ అని ఫియట్ ని కన్య అనీ ఒక ఆంగ్ల కవి ఎక్కడో వర్ణించిన గుర్తు]
వస్తా మరి... వీలైతే మళ్ళీ కలుద్దాం... 'విష్ మి బెస్ట్ ఆఫ్ లక్' 'వాట్...ఫర్'!
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
![](../images/spacer.gif) |
Advertisements |
|
![](../images/spacer.gif) |
![](../images/spacer.gif) |
Advertisements |
|