|
|
Articles: Short Stories | పొయెట్రీ ఆఫ్ లైఫ్ - Miss vijayalakshmi vijayalakshmi
| |
'రావుగారూ! రావుగారూ!! ఏమిటీ? మీరు ట్రాన్స్ లోకి వెళ్లిపోయారా? ఎందుకండీ అలా ఏడుస్తారు?' నా భుజం పట్టి కుదుపుతూ గట్టిగా అడిగాడు సైకియాట్రిస్టు.
'లేదు డాక్టర్! ఇతింత ఘోరాలు జరుగుతున్నాయని నేననుకో లేదు. మా అమ్మాయిని పువ్వుల్లో పెట్టి పెంచాను డాక్టర్! పువ్వుల్లో పెట్టి పెంచాను. నా కూతురికి చిన్న దెబ్బ తగిలినా నేను భరించలేను. అటువంటిది నా కూతురు.. నా కూతురు... డాక్టర్! నా కూతురింతటి నరకం అనుభవిస్తోందని నాకిప్పటి దాకా తెలీదు డాక్టర్! నేను మూర్ఖుడ్ని. వాళ్లడిగినంత కట్నం ఇచ్చాను. సారె పెట్టాను. కోరిన లాంఛనాలన్నీ జరిపించాను. ఘనంగా పెళ్లి చేశాను. ఇన్ని చేసినా, వాళ్లు.. వాళ్లు... చదువుల సరస్వతిలాటి నా కూతుర్ని...' ఇక మాటలు రాక భోరున ఏడ్చేశాను.
'మిస్టర్ రావ్! టేక్ ఇట్ ఈజీ! నిజంగా ఆ మాటలన్నీ మీ అమ్మాయివేననుకుంటున్నారా? కానే కావు. ఈ గదిలో నా పరిధిలో ఉన్నంత సేపూ మీకు నా సజెషన్స్ ప్రకారమే అనిపిస్తుంది. మీ అమ్మాయి అత్తారింట్లో కష్టపడిపోతోందనుకుంటున్నారా? నో! నాటెటాల్!! మీ అమ్మాయి చాలా సుఖంగా ఉందండీ! అయ్ నో ఇట్. జస్ట్ మీ అబ్బాయిని మామూలు మనిషిని చెయ్యడానికి ఇలా సీ.డీ తయారుచేసి వినిపించాను.'
'ఓహ్! హారిబుల్! వింటుంటే నా గుండె తరుక్కుపోయింది. ఈ షాక్ నించి ఇంకా నేను తేరుకోలేకుండా ఉన్నాను డాక్టర్!'
'ఈమాత్రానికే మీరింత షాక్ అయితే, మీ అబ్బాయికి నేనిచ్చిన పూర్తి ట్రీట్ మెంట్ మీరేం వినగలరు? టేక్ ఏ కప్ ఆఫ్ కాఫీ! అండ్ గెట్ యువర్ సెల్ఫ్ రిలాక్సుడూ, అంటూ డాక్టరు ఓ కప్పు కాఫీ ఇచ్చారు.
ఆ కాఫీ తాగాక నా మనసు కొంత స్థిమితపడింది. 'నేనే ఇంత షాక్ అయితే ఇక ట్రీట్ మెంటు తీసుకున్న మా వాడెలా తట్టుకున్నాడండీ? అసలే వాడికి చెల్లంటే పిచ్చి ప్రేమ' అన్నాను.
'రావుగారూ! నిజానికి ట్రీట్ మెంట్ ఇంతటితో అయిపోలేదండీ. మీరేడుస్తున్నారని చెప్పి సీ.డీ ప్లేయర్ని ఆఫ్ చేశాను. ఇంతటి షాక్ ట్రీట్ మెంట్ ఇస్తే గాని మీ అబ్బాయి మనుషుల్లోకి రాలేకపోయాడు. సర్లెండి సీ.డీ. ఫార్వర్డ్ చేస్తాను. తరవాత నా సజెషన్స్ వస్తాయి. ఇవి మిమ్మల్ని ఏమీ బాధ పెట్టవు అన్నాడు సైకియాట్రిస్టు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|