|
|
Articles: Short Stories | కొరికింది - Mr. krishna madugundu
| |
తొందరగా సీడీ తీసుకువెళ్ళాలి. ఇంటికి లేటుగా వెళ్తే ఆమె ఊరుకోదు, తన భరతం పడుతుంది అనుకొంటూ నాగభూషణం నడక స్పీడును పెంచాడు. కొత్త చెప్పుల్తో నడగ చక చక సాగిపోతుంది కానీ చెప్పులు కరుస్తున్నాయి. అయినా ఉత్సాహంగా ముందుకెళ్తున్నాడు. వసంత కాలం వచ్చేసింది. కాలనీ మొత్తం పూల మొక్కలతో శోభాయమానంగా వుంది. చూడ చక్కని అందమైన ఇళ్ళు. ఆ వీధి నిండా పూల వాసనలు. ఒక ఇంటి ముందు ఆగాడు. అదే మధుమతి గారిల్లని గుర్తు పట్టాడు. బోర్డు మీద ఆమె పేరు కనిపించిందే కానీ అతని పేరు లేదు. అప్పుడే అనుకున్నాడు, ఈమె కూడా నా శ్రీమతి లాంటేదే కాబోలు అని. ఆ పక్కనే కళ్ళకు ఇంకో బోర్డు కనిపించింది. కుక్కు వున్నది జాగ్రత్తా అని. అలా కళ్ళు తిప్పి చూశాడు. ఇంచుమించు అలాంటి బోర్డులే ఆ కాలనీలో ఉన్న ఇళ్ళన్నింటికీ వున్నాయి. మెల్లగా గేట్ తీశాడు. ఆ చిన్న శబ్దానికే శునకం బౌబౌమని అరిచింది. నాగభూషణానికి గుండె ఝల్లుమంది. దెయ్యమంటే భయం లేదుకానీ, కుక్కలంటే మహా భయం అతనికి. అయినా వెళ్ళాలి. వెళ్ళక తప్పదు కాబట్టి ధైర్యంతో ముందుకెళ్ళాడు. ఈ సారి కుక్క మీదికే వచ్చేసింది. ప్రాణాలు పోయినంత పనయింది నాగభూషణానికి. గుండె వేగం పుంజుకొంది. ఎయ్...ఎయ్ అంటున్నా రెండుకాళ్ళతో నిలబడి నాలుకాడిస్తూ గోళ్ళతో గోకింది. భయంతో నాగభూషణం అక్కడక్కడే తిరుగుతున్నాడు. కుక్క కూడా బౌబౌ మని అరుస్తూ అతని చుట్టూ తిరుగుతుంది. పారిపోవాలని ప్రయత్నించినా వీలుకాక పోవడంతో ఇక లాభం లేదనుకొని పెద్దగా కేక వేసాడు. ఎవరైనా రక్షించకపోతారా అనుకుంటూ ఎదురుచూస్తూ, భయంతో కళ్ళు మూసుకున్నాడు. ఆశ్చర్యం కళ్లు తెరిచి చూస్తే అక్కడ కుక్కలేకపోవడంతో ఊపిరి పీల్చాడు స్వేచ్ఛగా. గండం గడిచినంత ఫీలయ్యాడు. కుక్కు చిన్న పిల్లవాడు పిలిస్తే పక్కకు వెళ్ళింది. ఆ అబ్బాయి వస్తుంటే వాడి వెనకాలే తోక ఆడిస్తూ వచ్చింది. నాగభూషణం కాస్త రిలాక్స్ అయ్యేలేపలే ఆ పిల్లాడు మీరు ఎవరూ, ఎందుకు వచ్చారంటూ ప్రశ్నల వర్షం గుప్పించాడు.
మధుమతి మీ అమ్మేనా బాబూ అంటూ అడిగాడు నాగభూషణం.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|