|
|
Articles: Novels | సాఫ్ట్వేర్ ఇంజనీర్ - Mr. prasad bondalapati
| |
రోడ్డు పక్కకి వచ్చి ఆగింది మా సాఫ్ట్వేర్ కంపెనీ బస్సు. బస్సెక్కి రోజూ కూర్చునే సీట్ లో కూర్చున్నాను.
పక్క సీటు లో అప్పటి కే కూర్చున్న వెంకట్ అనబడే వెంకట్ రావ్ తెలుగు పేపర్ నమిలేస్తున్నాడు. ఇంకో ఇద్దరు మలయాళీ అమ్మాయిలు పాట పాడినట్లు గా వుండే మలయాళం లో మాట్లాడుకొంటున్నారు. ఎఫ్ ఎం రేడియో లో నుండి కన్నడ సినిమా పాట సందడి గా వినబడుతోంది. ఇంగ్లీషు పేపరు ఒకరి చేతిలో నుంచి ఇంకొకరి చేతి లో కి మారుతోంది. ఈ మధ్యనే వేడెక్కడం నేర్చిన బెంగళూరు గాలి ఆటోల పొగలను కలుపుకొని బస్సు కిటికీ ల నుండి లోనికి చొచ్చుకొస్తోంది.
'ఏమిటి వెంకట్ ఈ రోజు న్యూస్?' వెంకట్ ను కదిలించాను నేను.
'ఏమి వుంటుంది? ఏ రోజు న్యూస్ అయినా ఒకటే లా వుంటుంది. గవర్నమెంటు వాడు అపోజిషన్ను తిట్టుడూ .... అపోజిషనోడు గవర్నమెంటు ను తిట్టుడూ వగైరా వగైరా... ఇప్పట్నుండీ రెండు సంవత్సరాల తరవాతి న్యూసు కూడా ఇప్పుడే గెస్ చేసి చెప్పొచ్చు. కాని ఈ పేపర్ వాడికి మాత్రం బోరు కొట్టదు'.
'నీకు బోరు కొడితే పేపర్ ఎందుకు కొన్నావు?' నవ్వాను.
'మల్ల పేపర్వాడు ఎట్లా బతుకుతాడు?' వెంకట్ కూడా నవ్వాడు.
'ఈ బతుకు చూస్తుంటే హాయి గా మా పల్లె కి పోయి వ్యవసాయం చేసుడు బెటర్ అనిపిస్తోంది,' అన్నాడు వెంకట్.
'మరి ఆ పనే చెయ్యక పోయావ్?' మెల్ల గా నవ్వుతూ అన్నాన్నేను.
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|