|
|
Articles: My Thoughts | మొర విను గోపాలా! - Mrs. Padma Sreeram V.
| |
స్వామీ! నువ్వు కురుక్షేత్రంలో అర్జునుడికి సారధివై విజయాన్నిచ్చావు. అలాగే భారత హాకీ టీం కెప్టెన్సీ ఓ పాలి చేపట్టి గెలిపించు ప్లీజ్ (కెప్టెన్ అయ్యాకా నీకొచ్చిన ఆటలు కూడా నువ్వు మర్చిపోతావనుకో. అది వేరే విషయం)
స్వామీ! కాళింది నదిని కలుషితం చేస్తున్నాడని కాళీయుని చంపావ్. కానీ సమాజాన్ని కలుషితం చేసే రాజకీయ నాయకుల చదరంగాలని, అమాయకులని బలితీసుకొనే ఉగ్రవాదాన్ని ఒక్కసారంటే ఒక్కసారే కూకటివేళ్ళతో పీకేసి అప్పుడెళ్ళి నీ పాల సముద్రంలో పడుకోవయ్యా .
స్వామీ! నరకాసురుని చెర నుంచి 16000 మంది కన్నెలను విడిపించావు. ఇప్పుడు ప్రేమోన్మాదంతో అమ్మాయిలను శారీరకంగా, మానసికంగా హత్య చేస్తున్న మృగాల బారి నుంచి ఆడపిల్లల్ను రక్షించవా?
స్వామీ! నిండుసభలో ద్రౌపదికి నువ్వు చాలా చీరలిచ్చావు. మల్లికా షెరావత్ కి ఇంకా పాపం బోల్డుమంది తెలుగు వీరోయిన్లకి చీరలు లేక వస్త్రదారిద్ర్యంతో సినిమాల్లో నటిస్తున్నారు. పాపం వాళ్ళందరికీ కూడా కనీసం అర చీరైనా అప్పుగా ఇవ్వు?
స్వామీ! చాలా చెప్పేసాను అలసిపోయానయ్యా. చివరిగా మరొక్క మనవి. నా పతిదేవుని, నన్నూ, నా అత్తింటి జనాలని, నా పుట్టింటిని , నా ఆఫీస్ ఫైనాన్షియల్ స్టేటస్ ని, మార్కెట్లో దాని రెప్యుటేషన్ ని చల్లగా చూడు. మర్చిపోయాను నిన్ను కూడా నువ్వు బాగా చూసుకో. నా మతిమరుపుని మాత్రం వగ్గెయ్యడం మరిసిపోమాక!
(సేకరణ)
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|