|
|
Articles: Short Stories | పండుగ - Site Administrator
| |
(బోడపాటి రమేష్)
ఏమండీ... పండగ దగ్గర పడుతోంది అమ్మాయిని, అల్లుణ్ణి నాలుగు రోజులు ముందుగానే రమ్మని ఉత్తరం రాయండి. ఆ చేత్తోనే మన అబ్బాయిని కూడా కోడలు, పిల్లలతో రమ్మనండి అన్నది కమలమ్మ భర్త కాంతయ్యతో.
నీకంటే ముందే ఆ ఆలోచన వొచ్చిందోయ్. ఈ పాటికి వాళ్ళకు ఉత్తరాలు అందే ఉంటాయి అన్నాడాయన.
పోనీలెండి నాకు చెప్పకపోయినా మంచి పని చేసారంటూ భర్తను మెచ్చుకుంది.
ఉత్తరాలు అందుకున్న కూతురు, అల్లుడూ ముందుగానే వచ్చేశారు. వాళ్ళొచ్చిన కొద్ది సేపటికే కొడుకు కుటుంబం కూడా వచ్చేసింది. కుశల ప్రశ్నలు, పలకరింపులు పూర్తయ్యాయి.
కమలమ్మకు కూతురి సంతానం, కొండుకు సంతానం చూసుకోటానికే సమయం సరిపోవడం లేదు. వాళ్ళు కూడా అమ్మమ్మ, నాయనమ్మ అంటూ ఆవిడవెనకాలే తిరుగుతున్నారు. అందరికీ ఒకే కంచంలో అన్నం కలిపి, ఆవిడ ముద్దలు పెడుతూంటే వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. అది చూస్తున్న ఆవిడ ఆనందానికి అంతులేదు. భార్య ఆనందంలో కాంతయ్య కూడా పాలు పంచుకుంటున్నాడు.
వదినా మరదళ్ళయితే ఇంటి పనంతా చక్కబెట్టేస్తున్నారు. ఎలాగయినా ఈ కాలం పిల్లలు కాదు అని ఆవిడ మురిసిపోయింది. కోడలు కూడా తమలో కలిసిపోవడం ఆవిడకు సంతృప్తినిచ్చింది.
ఏవండీ... చూశారా! ఇల్లెంత కళకళలాడుతుందో అందరూ ఒక్కచోట కలవడమే పండగ అన్నది భర్తతో.
పండగ వెళ్ళిన తర్వాత ఒకళ్ల తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోవడంతో ఇల్లంతా బోసిపోయి నట్టయింది. మళ్ళీ పండగ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడ్డం ఆవిడ వంతంయింది.
అడపా దడపా కూతురు కుటుంబం, కొడుకు కుటుంబంరావడం జరుగుతోంది. వాళ్ళు వచ్చినప్పుల్లా ఆవిడకు పండుగే.
కానీ కాలం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదుకదా..!
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|