|
|
Articles: Short Stories | దొరబాబు దూరదర్శిని - Site Administrator
| |
ఆ తర్వాత నాలుగు రోజులు ఆఫీసు పనిమీద ఊరికెళ్లిన నేను తిరిగి వచ్చేసరికి పాతిక లంఖనాలు చేసిన వాడిలా నీరసించి పోయి కనిపించాడు దొరబాబు. ఏమయ్యిందయ్యా అంటే సరిగ్గా చెప్పలేదు. పనిహడావిడిలో ఆపూట వివరంగా మాట్లాడటం కుదరక, సాయంత్రం అతనింటికి ఫోన్ చేస్తే అతను ఇంట్లో లేడని తెలిసింది. టీ.వీ. లేకుండా మనవాడు ఎలా మేనేజే చేస్తున్నాడూ అని అతని భార్యని అడిగితే తెలిసిన విషయమేమిటంటే, టీవీ చూడక మొదటి రోజు సాయంత్రమంతా కాలు కాలిన పిల్లిలా తిరిగిన మనిషి, మరుసటి రోజుకల్లా నిప్పు తొక్కిన కోతిలా చిందులు వేయడం, చిరాకు పడటం, అందరి మీదా విసుక్కోవటం లాంటి విత్ డ్రాయల్ సింప్టమ్స్ చూపించాడట. ఇంకా ఊరుకుంటే గిల్లటం, మీదపడి రక్కటం లాంటి దుశ్చర్యలకు ఉపక్రమిస్తాడేమోనని భయపడిన ఆ ఇల్లాలు ఓ సలహా ఇచ్చిందంట. 'టీవీ చూడకూడదన్నారు కానీ సినిమాలు చూడకూడదు అనలేదు కదా. మీరు ఆ సినిమాలేవో చూస్తూ కాస్త శాంతించండి బాబూ, ఇంటిల్లిపాదీ కాస్త ప్రశాంతంగా ఉంటాం' అని చెబితే, మొత్తానికి విని కొన్ని పాత సినిమా డీవీడీలు తెచ్చుకుని వాటిని చూడడం మొదలు పెట్టాడట. (కొత్త సినిమాలు కాకుండా ప్రత్యేకంగా పాత వాటిని చూడటంలో ఏదో అంతరార్థం ఉందని నా ప్రగాఢ నమ్మకం. మసాలా దట్టించిన, కంగాళీ కొత్త సినిమాలు కన్నా, శాకాహారం లాంటి పాత సినిమాలను చూస్తే తక్కువ అపరాధ భావం ఉంటుందన్న ఆలోచన మావాడి కొచ్చి ఉంటుందన్నది నా యోచన).
పిల్లల చేత హోం వర్కులు చేయించడం, వాళ్ళని ఆటలకీ, పాటలకీ తీసుకువెళ్లి రావడం, ఇతరత్రా పనులన్నీ పూర్తి అయి, వాళ్ళు పడుకున్నాక (అవును మరి వాళ్ళకి తన నిర్వాకం తెలియకూడదుగా) సుదీర్ఘమైన తెలుగు సినిమాలు చూడటం మొదలుపెట్టి, ఏ అర్థరాత్రి వరకూనో మేలుకుని ఉండి, సరిగా నిద్ర చాలక నీరసించి పోయాడు అన్నది అసలు కథ.
సినిమాలను ఇన్ స్టాలు మెంట్స్ లో చూసే అలవాటులేదులెండి మనవాడికి. టైటిల్స్ నుంచి శుభం కార్డు వరకూ ఏకధాటిన చూస్తేగానీ సినిమా చూసినట్లుండదు అంటాడు. కథ ఇక్కడితో అయిపోయింది అనుకుంటే పొరపాటే. ఇంకా ముఖ్యమైన విషయం ఆ పైవారానికి గాని బయల్పడలేదు. అదేమిటంటే, ముందు వారంలో తను చూసే గంటల కొద్దీ టివీ ప్రోగ్రాములన్నీ రికార్డు చేసుకుని, తరువాత వారంలో మామూలు ప్రోగ్రాములతో బాటు రికార్డు చేసిన వాటిని కూడా చూస్తూ రాత్రులు నిద్రకు మరింత దూరమై, పగలు అలసటకు మరింత దగ్గరై వడిలిపోయిన తోటకూర కాడలా తయారయ్యాడు మా దొరబాబు. 'పచ్చి కూరల మాసం (నేషనల్ సాలాడ్ మంత్ ) అయిన మే నెలకి సింబల్ గా.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|