|
|
Articles: Short Stories | అనగా అనగా... - Site Administrator
| |
అతను : లేదు బంగారూ.... పులి కూడా మంచిదే, కానీ ఆకలేస్తే మాత్రం ఎదురుగా ఏముంటే దాన్ని తినేస్తుంది. సరే. ఒక రోజు దూడ ఎవరికీ చెప్పకుండా అడవి వైపు వెళ్ళింది. కొంచెం బయం వేసింది. అయినా సరే... ఇవాళ ఎలాగైనా అడవిని చూడాలి... అని పట్టుబట్టి, మెల్లిగా అడవిలోకి వెళ్ళిపోయింది.
అమ్మలు : అమ్మో!
అతను : ఆ! ఇంతలో సాయంత్రమై పోయింది. దూడ అడవిలో బోలెడంత ఆహారం చూసింది. కడుపునిండా, హాయిగా మేసింది. రకరకాల జంతువుల్ని చూసింది. తనలాంటి దూడల్ని కూడా చూసింది.
కాని అవేవీ అంత స్నేహంగా మాట్లాడలేదు. దేని తిండి గొడవలో అది, అలా తిరుగుతున్నాయి. ఇంతలో పులి గాండ్రింపు వినిపించింది. గజగజా వణికిపోయింది దూడ. ఢామ్మని ఎక్కడి నుంచో దూకింది పులి. దూడని చూసి అడవికెందుకొచ్చావ్? అంది ఇక్కడ బోల్డంత ఆహారం వుందనీ, బోల్డన్ని జంతువులు కూడా వున్నాయనీ మా నేస్తాలు చెబితే, చూద్దామని వచ్చాను అంది దూడ వణికిపోతూ..
పులి సరే, ఈ అడవి నియమం చెబుతాను విను. ఇక్కడ నీలాగా బోలెడన్ని దూడలున్నాయి. నాలాగా బోలెడన్ని పులులూ వున్నాయి. మా సింహం రాజుగారు అన్ని జంతువుల్నీ రానిస్తారు తన రాజ్యంలోకి, కాని ఒకసారి వచ్చిన జంతువు, కొన్నేళ్ళ వరకూ వెనక్కి వెళ్ళడానికి వీలులేదు. వెళ్ళాలని ప్రయత్నిస్తే, ఆయన, ఆ జంతువుని తినేస్తారు. ఇక్కడ స్వేచ్ఛగా బ్రతుకు, కానీ, ఆకలేసి నప్పుడు నాలాంటి పులి కంటపడ్డావో, నీ పని కాస్తా, ఢాం. కాబట్టి తెలివిగా, మెలకువతో బతకటం నేర్చుకో. అర్థం అయిందా? అంది.
దూడ, అయ్యో, నేను వెనక్కి వెళ్లిపోవాలండీ, నన్ను చూడకపోతే మా అమ్మ ఏమీ తినదు. పాపం, ఏడుస్తుంది కూడా. అందుకే నేను వెళ్ళిపోతానండీ అంది పులి. ఇలాంటి వేషాలేస్తే నిన్ను ఇప్పుడే తినేస్తా. జాగ్రత్త! బుద్ధిగా అడవిలోకి పోయి స్వేచ్చగా బతుకు, ఫో అని దూడని అడవిలోకి తరిమేసి వెళ్ళిపోయింది. దూడ అడవిలో వుండిపోయింది. భయపడుతూ భయపడుతూ బతకటం నేర్చుకుంది. పులి నుంచీ, సింహా రాజు గారినించీ, తెలివిగా తప్పించుకోవడం తెలుసుకుంది. కొన్నాళ్ళకి ఆ భయం, అడవీ అలవాటైపోయింది. కొన్నేళ్ళు గడిచి పోయాయి. పాపం... ఆవు రోజూ అడవి సరిహద్దు దగ్గరకొచ్చి దూడని పిలిచేది. ఎంతో సేపు ఏడ్చి, ఏడ్చి, అలిసి వెనక్కి వెళ్ళిపోయేది. కానీ దూడ రాలేదు. ఇప్పుడు దూడ కూడా పెద్ద ఆవు అయిపోయింది. దానికీ ఓ చిన్న దూడ. ఒకసారి చిన్న దూడ అడిగింది - అమ్మా మనం ఎవరం? ఎందుకిలా, రోజూ భయం భయంగా బతుకుతున్నామూ? అని. అప్పుడు గుర్తొచ్చింది దూడకి, తన గడువు తీరిపోయిందనీ, తను వెనక్కి వెళ్ళిపోవచ్చుననీ. అంతలోనే యేదో అనుమానం... తను వెనక్కి వెళితే తనకీ, తన దూడకీ అక్కడ ఆహారం దొరుకుతుందో? లేదో? ఇన్నాళ్ళూ అడవిలో పెరిగిన పిల్లదూడ, వూరిలో బతకగలదా? తన దూడకి ఏమైనా అయితే? అమ్మో... ఇలా ఆలోచనలో పడిపోయింది ఒకప్పటి దూడ...
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|