|
|
Articles: Short Stories | అనగా అనగా... - Site Administrator
| |
ఆమె : శీను గారండీ! పిల్లలు పడుకుని అరగంట అయింది. కథ ఎవరికి చెబుతున్నారండీ? అయినా పిల్లల కెవరేనా ఇలాంటి కథలు చెప్తారా? పాపం... దడుసుకోరూ?
అతను : లేదు కన్నా, వాళ్ళకి యే కథైనా మొదట్లోనే తెలుసు. కథ కొంచెం అవగానే నిద్రపోతారు వాళ్ళు. అందుకే, వాళ్ళకి ఏ కథ చెప్పినా దడుసుకోరు అంటూ మెల్లిగా వాళ్ళ గదిలోకి నడిచాడు. వెనకాలే ఆమె. అతను కాసేపు అలాగే కూర్చుండిపోయాడు. తరువాత ఆమె మెల్లిగా అతని వొడిలోకి చేరింది.
ఆమె : ఏమండీ, ఆ దూడ వెనక్కి వెళ్ళిందా? అంది తల పెకెత్తి అతని కళ్ళలోకి చూస్తూ.
అతను : తెలియదు కన్నా. కొన్ని కథలకి ముగింపు వుండదు. వున్నా మనకి తెలియదు.
ఆమె : లేదండీ... ఈ కథ మీరే మొదలు పెట్టారు, కనక మీరే పూర్తిచెయ్యాలి, పూర్తిచెయ్యండి శ్రీనూగారూ... ప్లీజండీ... అంది గోముగా, చిన్నపిల్లలా.
అతను : మ్....సరే అయితే, ఆ దూడ వెనక్కి వెళ్ళి హాయిగా జీవితం గడిపేసింది, తన దూడతో. మళ్ళీ ఇంకెప్పుడూ అడవి వైపు కూడా చూడలేదు.
ఆమె : మా శ్రీవారు మంచివారు అంటూ అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది...
అతను : జీవితం కథ అయితే ఎంత బావుంటుందో... కదూ.... కన్నా? అడిగాడు అతను, ఆమె తల నిమురుతూ.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|