|
|
Articles: Short Stories | పే పాల్ - Site Administrator
| |
- కె.వి.గిరిధరరావు
ఆ రోజు రాత్రి డిన్నర్ చేసేటప్పుడు 'త్వరలో మా కంపెనీ ఇంకొంతమంది జనాలని పీకేస్తుందట' చెప్పాడు సురేష్ భార్యతో.
'మళ్ళీనా... రెణ్ణెళ్ల క్రితమేగా కొందరిని తీసేసారన్నారు' అంది సుజాత ఆశ్చర్యంగా.
'అవును... ఇది ఇంకో రౌండు' చెప్పాడు సురేష్.
'ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందోనని బిక్కుబిక్కుమనుకుంటూ ఇక్కడే వ్రేళ్ళాడే బదులు, నా మాట విని ఇండియా వెళదాం పదండి' అంది సుజాత, రసం పోసుకుంటూ.
సురేష్ ఏమీ మాట్లాడలేదు.
'ఈ ఉద్యోగం పోతే మరొకటి దొరకడం కష్టమంటున్నారు కదా. ఏదో అయిదేళ్ళపాటు ఇక్కడ ఉన్నాం. ఈ దేశాన్ని చూశాం. కాస్తో కూస్తో కూడబెట్టుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతే అక్కడ మంచి ఉద్యోగమే దొరుకుతుందంటున్నారు కదా! అక్కడైతే ఉన్న డబ్బుతో ఇల్లు కొనుక్కొని, మిగిలింది బేంకులో వేసుకుని... ఉద్యోగం ఉంటుందా... ఊడుతుందా అన్న టెన్షన్ లేకుండా బతకొచ్చు' పాత పాటే మళ్ళీ పాడింది సుజాత.
'మన దగ్గరున్న సేవింగ్స్ కు హైదరాబాద్ లో అపార్ట్ మెంటొస్తే గొప్ప...' అన్నాడు సురేష్.
గత నాలుగైదేళ్ళలో హైదరాబాద్ రియలెస్టేట్ రేట్లూ ఆకాశన్నంటాయి. కాస్టాఫ్ లివింగ్ బాగా పెరిగింది.
'స్టాకుల్లో అంతా హారతి కర్పూరం చెయ్యబట్టే కదా సేవింగ్స్ కు చిల్లి పడింది. మీ నిర్వాకాలన్నీ అంతే' అంది సుజాత.
సుజాత గొంతు ననుకరిస్తూ 'స్టాకుల్లో వాళ్ళంత సంపాయించారు.... వీళ్ళింత సంపాదిస్తున్నారు అని చేతులు తిప్పుతూ నువ్వే కదా నన్ను ఎగదోసింది... ఏదో ఎకానమీ సడన్ గా పడిపోబట్టి లాసొచ్చింది. మళ్ళీ ఇప్పుడు స్టాకులు పెరుగుతున్నాయి కొందామంటే నువ్వేగా వద్దని ఆపుతున్నావ్' ఉక్రోషంగా అన్నాడు సురేష్.
'లాభమొస్తే మీ ప్రతిభ... నష్టమొస్తే నా వల్ల. చేసిందంతా చేసి అంతా నా మీదకు నెడతావేం?' అంది సుజాత.
ఫోను రింగ్ కాకపోతే ఇంకాసేపు గొడవ పడేవాళ్ళే.
'మీకే..' ఫోనందించి, ప్లేటు తీసుకుని సింక్ దగ్గరకెళ్ళింది సుజాత.
ఒక నిమిషం మాట్లాడాక తింటున్న ప్లేటును డైనింగ్ టేబుల్ దగ్గరే వదిలేసి, బెడ్ రూమ్ లోకెళ్ళాడు సురేష్.
ఫోనులో సురేష్ అరుస్తున్నట్లు అనిపించి, అటువైపు వెళ్ళింది సుజాత.
అప్పటికే ఫోను పెట్టేసి, బెడ్ రూములో ఒక మూలన ఉన్న కంప్యూటర్ ముందు కూర్చుని కనిపించాడు సురేష్.
'ఏమైంది?' అడిగింది సుజాత.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|