|
|
Articles: Short Stories | పే పాల్ - Site Administrator
| |
'అబ్బే ఏమీ లేదు. చిన్న బిల్లింగ్ ప్రోబ్లెం' అంటూ బలవంతాన నవ్వాడు.
'క్రెడిట్ కార్డుదా?' అడిగింది భర్తను గమనిస్తూ.
ఏదో ఒకటి చెప్పకపోతే వొదలదని 'అవును క్రెడిట్ కార్డుదే' అన్నాడు
'ఏ క్రెడిట్ కార్డు?' అడిగిందీ మళ్ళీ.
అసహనాన్ని అణచుకుంటూ 'వీసా కార్డు' చెప్పాడు గట్టిగా, గొంతులో కోపాన్ని, విసుగునూ ధ్వనిస్తూ.
'ఏ వీసా కార్డు...బేంకాఫ్ అమెరికాదా?' అడిగింది మళ్ళీ.
'ఏదైతే నీకెందుకు? వెళ్లి అంట్లు తోముకోక?' అరిచాడు గట్టిగా.
దాంతో ఇదేదో చిన్న బల్లింగ్ మిస్టేక్ వ్యవహారం కాదని తేలింది సుజాతకు.
మాట్లాడకుండా గదిలోంచి బయటికొచ్చి టీవీ ముందు కూర్చుంది.
స్టాకుల్లో దెబ్బ తిన్నప్పటి నుంచీ, డబ్బు వ్యవహారాల్లో మొగుణ్ణి ఓ కంట కనిపెడుతూనే ఉంది. ఈ మధ్య ఎక్కువగా కంప్యూటర్ దగ్గర కూర్చుంటున్నాడు. కొంపదీసి ఆన్ లైన్ గేంబ్లింగ్ ఆడి ఉన్న సేవింగ్స్ ను కులికించాడా అన్న అనుమానమొచ్చింది.
కోపంగా ఉన్నాడు కాబట్టి, ఇప్పటికి వదిలేసి వ్యవహారం రేపు తేల్చుకోవచ్చనుకుంది.
పక్కమీద కళ్ళు మూసుకుని పడుకున్నాడన్న మాటేగానీ అస్సలు నిద్ర పట్టలేదు సురేష్ కు.
0-0-0
'పే పాల్ కంపెనీవాళ్ళు ఫోనులో చెప్పిన విషయాలే చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. తలచుకుంటే అంతా కలలా ఉంది.
నెల క్రితం 'తుమ్మితే వూడే ముక్కులాంటి ఉద్యోగంతో ఎన్నాళ్ళిలా బతుకునీడ్చడం?! డబ్బు సంపాదించడానికి ఇంకేమీ మార్గాలు లేవా?' అని తీవ్రంగా ఆలోచిస్తున్న తరుణంలో...
'ఇంటి నుంచి పని చేయండి' అని ఒక ఇ-మెయిల్ వొచ్చింది.
రెండు పేజీల ఈ మెయిల్ ను చాలా ఓపిగ్గా చదివాడు సురేష్.
'కంప్యూటరూ, ఇంటర్నెట్ కనెక్షనూ ఉంటే చాలు మరే పెట్టబడి, అనుభవం అవసరం లేదు.... కాలేజి డిగ్రీ ఉన్నాలేకున్నా ఫరవాలేదు.... మీకు మేరే బాసు. పార్టు టైము చెయ్యొచ్చు, ఫుల్ టైము చెయ్యొచ్చు... కుదరకపోతే మీకు ఖాళీ ఉన్నప్పుడు చెయ్యొచ్చు. పూర్తి వివరాలకు ఈ మెయిలుతో సంప్రదించండి.'
చాలా ఆకర్షణీయంగా కనిపించింది.
'ఆలస్యం అమృతం విషం' అనుకుంటూ వెంటనే వివరాల కోసం ఈమెయిలు పంపాడు.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|