|
|
Articles: My Thoughts | చెట్ల వెక్కిరింత - Site Administrator
| |
మనిషి సౌకర్యాలకోసం రోడ్లు వేయడం మొదలుపెట్టిన తర్వాత తొలిగా బలైంది రోడ్డు పక్కనున్న చెట్లు. ఒకప్పుడు రోడ్లకి ఇరువైపులో నీడనిచ్చే చెట్లు వుండేవి. `అశోకుడు చెట్లు నాటించెను' అని చరిత్రలో చదివే వుంటారు. ఆ చెట్లు నాటించటమే చరిత్రా! అంటూ ఎద్దేవా చేసినవారు లేకపోలేదు. ఆ చెట్లు నాటించటం వెనకున్న ముందుచూపు అర్థం చేసుకోటానికి ఇన్ని దశాబ్దాలు పట్టింది. రోడ్డు వెంట నడిచేవారికి నీడనిచ్చే చెట్ల వల్ల శ్రమ తెలియకుండా నడవగలిగేవారు. అలసిపోతే చెట్టునీడన హాయిగా విశ్రమించేవారు.
కాని ఇప్పుడు నగరంలో నడిచేవారికి నీడలేదు. చెట్లు అంటే ఏమిటో తెలియని పిల్లలు పెరుగుతున్నారు. నగరాలలో ఎక్కడైనా ఇంటిలో చెట్టు మిగిలిందా! అనేది సందేహమే. ప్రతి అడుగు స్థలం విలువైనదపుడు ఆ అడుగు స్థలాన్ని అనవసరంగా ఒక మొక్కకు ఎందుకు ఇవ్వాలనుకొంటున్నాడు నగరవాసి. ఫలితం చెట్లు కేవలం పార్కులకు పరిమితమయ్యాయి. పిల్లలకు ప్లాస్టిక్ తీగలు, పువ్వులు మాత్రమే పరిచయమవుతున్నాయి.
నగరాలలో చెట్లు అంతరించటం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. నగరాలలో ఏటికేడు పెరుగుతున్న ఉష్ణోగ్రతను తట్టుకోవడం కష్టంగా వుంది. షాపింగ్ మాల్ లు, షోరూమ్ లతో పోటీగా ఇళ్ళలో కూడా ఎయిర్ కండీషనర్ లు వాడుకుంటున్నారు. కూలర్స్, ఎసిల వాడకానికి విద్యుత్ కావాలి. విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే జల విద్యుత్ కేంద్రాలో, బొగ్గు విద్యుత్ కేంద్రాలో కావాలి. బొగ్గు గనుల కోసం అడవులు ఆక్రమిస్తున్నాం. అడవులు పోవటమంటే వర్షపాతం పడిపోవడటమే. వర్షపాతం పడిపోతే జలవిద్యుత్ కేంద్రాలకు తగినంత నీరు వుండదు. ఇదీ ప్రస్తుత మన పరిస్థితి.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|