|
|
Articles: Short Stories | గ్రహణం - Site Administrator
| |
`ఏమిటండీ! మరీ తెలుగును తీసి పారేస్తున్నారు? మీరసలు హెడ్మాస్టరేనా? పది కోట్లమంది మాట్లాడే భాషను, ప్రపంచంలోనే ఆరో స్థానాన్ని ఆక్రమించిన భాషను అట్లా తీసి పారేస్తారా? మహామహులంతా నేర్చుకున్నది వాళ్ల మాతృభాషలోనే. అందుకే వాళ్ళ భావాలు అంత ఉన్నతంగా ఉన్నాయి. తెలుగు బళ్ళో హెడ్మాస్టరుగా ఉంటూ మీ పిల్లల్నిఇక్కడే చేర్పించకుండా, ఎక్కడో ఇంగ్లీషు కాన్వెంటులో చదివిస్తూ ఉన్నారంటే మీ సంస్కారం ఏమిటో తెలుస్తా ఉంది. ఇట్లాంటి చోట నా పిల్లలు చదవడం నాకు అసహ్యం' అనేసి పిల్లల్నిద్దర్నీ రెండు చేతుల్తో లాక్కుంటూ బయటికివచ్చేశాడు చందు.
వింత మనిషిని చూస్తున్నట్టు అవాక్కయి ఉండిపోయాడు హెడ్మాస్టరు.
రాత్రి భోంచేశాక -
చందు ఉంటున్న ఇంటికి కాస్త దూరంలో గవర్నమెంటు ఎలిమెంట్రీ స్కూలు ఉందనీ, అందులో చేర్పిద్దామని చెప్పంది చందు భార్య.
మరుసటి రోజు పొద్దున్నే పేపర్ చదువుకుంటూ వరండాలో అరుగు మీద కూచుని కాఫీ తాగుతూ ఉన్నాడు చందు.
`ఏమప్పా బాగుండావో!' అన్న పలకరింపుతో తలెత్తి చూశాడు.
ఆ వచ్చింది అతని దూరపు బంధువు మునెయ్య. తెల్ల చొక్కా, అడ్డ పంచెతో ఉన్నాడు. మనిషి కారునలుపు. అయితే స్వచ్ఛంగా నవ్వుతూ ఉంటాడు. జిల్లాలోని మారుమూల పల్లెనించీ ఇరవై ఏళ్ళ క్రితం అనంతపురానికి చేరుకున్నాడు. అదేదో మోటారు ట్రైవెల్స్ లో హమాలీగా పనిచేస్తూ ఉంటాడు.
`ఆ! బాగున్నానన్నా! ఏమీ ఈ నడుమున కనపడేదే లేదే?' అన్నాడు నవ్వుతూ చందు.
`అవును - చాన్నాళ్లాయే కదా నేను ఈటికి రాక' అంటూనే చందు పక్కనే కూచున్నాడు మునెయ్య.
చందు భార్య, మునెయ్య వచ్చింది గమనించి, వెంటనే కాఫీ ఇచ్చింది. ఆమెను పలకరించాడు అతను.
కాసేపు మాట్లాడుకున్నాక జేబులోంచి ఒక కవర్ని తీసి చందూకిచ్చాడు మునెయ్య.
కవరు తెరిచాడు... అందులోంచి ఒక ఫోటో బయటికి తీశాడు చందు.
అది రంగుల్లో తీసిన ఫోటో... నాలుగేండ్ల పిల్లోడు - ఎర్ర నిక్కరూ, ఆకుపచ్చ చొక్కా వేసుకొని అమాయకంగా నవ్వుతూ ఉన్నాడు.
ఎవరనుకుంటి చంద్రప్పా! నా కొడుకు వెంకటరమణ అన్నాడు మురిపెంగా నవ్వుతూ మునెయ్య.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|